రేపు OTT లో రిలీజ్ కాబోతున్న ‘కార్తికేయ 2’..ఎందులో అంటే..!

Updated on 04-Oct-2022
HIGHLIGHTS

కార్తికేయ 2 సినిమా OTT రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వారికీ గుడ్ న్యూస్

కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది

ఈ సినిమా తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో రేపటి నుండి స్ట్రీమ్ అవుతుంది

కార్తికేయ 2 సినిమా OTT రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వారికీ గుడ్ న్యూస్. రేపు దసరా పండుగ సందర్భంగా Zee 5 లో 'కార్తికేయ 2' ని రిలీజ్ చేస్తోంది. నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరో ఇన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అక్టోబర్ 5 నుండి Zee 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో రేపటి నుండి స్ట్రీమ్ అవుతుంది.

వాస్తవానికి, కార్తికేయ 2 విడుదలకు ముందు అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. సినిమా స్క్రీన్స్ ఇబ్బంది ఉండడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా చిత్ర యూనిట్ మార్చవలసి వచ్చింది. అయితే, అన్ని ఒడిదోడుకులను ఎదుర్కొని ఈ సినిమాను చాలా థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది. కానీ, ఈ సినిమాకు ప్రజలు మరియు ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్, రివ్యూ మరియు పబ్లిక్ టాక్ తో ఈ సినిమా దిన దిన సంవర్ధమానంగా స్క్రీన్ లను పెంచుకుంటూ పోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ మూవీలను సైతం పక్కకు నెట్టి ఈ సినిమాను అదే థియేటర్లో తీసుకునేంత గొప్ప స్థాయిని  కార్తికేయ 2 సినిమా సాధించింది.

కార్తికేయ 1 కి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా కలక్షన్లను సాధించింది. ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చుచేసిన మొత్తం కంటే కూడా ఇది చాలా రేట్లు ఎక్కువని మరియు ఈ సినిమా ఈ సంవత్సర బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటని, సినిమా వర్గాలు పొగుడుతున్నాయి. ఈ సినిమలో నిఖిల్ సిద్దార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ నటన గురించి సర్వత్రా ప్రశంసలు అందుకుంన్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :