karthikeya 2 OTT లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..కొత్త అప్డేట్ ఇదే.!

karthikeya 2 OTT లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..కొత్త అప్డేట్ ఇదే.!
HIGHLIGHTS

ప్రస్తుతం ఆన్లైన్లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయం 'కార్తికేయ 2 OTT' రిలీజ్

ఇంకా karthikeya 2 సినిమా థియేటర్లలో దిగ్విజయంగా నడుస్తోంది

karthikeya 2 OTT రిలీజ్ గురించి ఆన్లైన్లో కొత్త విషయాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి

ప్రస్తుతం ఆన్లైన్లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయం 'కార్తికేయ 2 OTT' రిలీజ్ ఎప్పుడు అని. అంతగా కార్తికేయ 2 సినిమా ప్రజలను ఆకట్టుకుంది. నిఖిల్ సిద్దార్ద్ హీరోగా చెందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 1 కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది మరియు ఇంకా సినిమా థియేటర్లలో దిగ్విజయంగా నడుస్తోంది. అయితే, ఈ సినిమా OTT రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజు కు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

కార్తికేయ 2 సినిమా విడుదలకు ముందు అనేక ఒడిదుడుకులను దాటుకొని సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యింది. అయితే, కేవలం నామ మాత్రపు ధియేటర్ సంఖ్యలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే, కార్తికేయ 2 సినిమా ప్రేక్షకులను అమితంగా అక్కటుకోవడం మరియు సినిమాలో ఉన్న బలమైన కంటెంట్ కారణంగా కేవలం షోషల్ మీడియాలో నెటిజన్ల పబ్లిసిటీతోనే అతిభారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తికేయ 2 హిందీ వెర్షన్ ఇప్పటికీ మంచి కలక్షన్స్ సాధించడం విశేషం. అయితే, ఇప్పుడు ఈ సినిమా OTT రిలీజ్ గురించి ఆన్లైన్లో కొత్త విషయాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.

కార్తికేయ 2 సినిమా OTT లో ఎప్పుడు రిలీజ్ చేయబోతోంది అనే విషయం పైన Zee 5 స్పందించింది. ఈ సినిమాను పైన మీరు చూపిస్తున్న స్పందనకు సంతోషంగా వుంది, మరికొంత కాలం వీచు ఉండండి అని చెబుతోంది. అయితే, ఈ సినిమాను విజయదశమి (దసరా) సందర్భంగా OTT లో రిలీజ్ చేయవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. కానీ, కార్తికేయ 2 సినిమా OTT రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకూ ఎదురుచూడాల్సిందే.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo