కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!!

Updated on 27-Sep-2022
HIGHLIGHTS

కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

కలక్షన్ల సునామి సృష్టించిన కార్తికేయ 2 సినిమా

కార్తికేయ 2 OTT రైట్స్ ను Zee 5 దక్కించుకుంది

నెటిజన్లు చాలా కాలంగా ఆతృతగా ఎదురు చూస్తున్న కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. తెలుగు రాష్టాలతో పాటుగా నార్త్ లో కూడా కలక్షన్ల సునామి సృష్టించిన కార్తికేయ 2 సినిమా యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు బయటికి వచ్చింది. చెందు మొండేటి అపురూప దృశ్య కావ్యం కార్తికేయ 1 కు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 ఊహించనంత భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా నార్త్ లో ఇప్పటికీ మంచి కలక్షన్లను వసూలు చేస్తోందంటే, ఈ సినిమాకు నార్త్ లో ఉన్న క్రేజ్ మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా OTT రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్.

నిఖిల్ సిద్దార్ద్ హీరోగా వచ్చిన ఈ ఎపిక్ బ్లాక్ బాస్టర్ మూవీ OTT రైట్స్ ను Zee 5 దక్కించుకుంది. ఈ సినిమాను దసరా పండుగ కానుకగా Zee 5 ఓటీటీ లో రిలీజ్ చేస్తుందని సర్వత్రా నివేదికలు చెబుతున్నాయి. కొత్త రిపోర్ట్ చెబుతున్న విషయాన్ని విశ్వసితే, కార్తికేయ 2 సినిమా అక్టోబర్ 5 నుండి Zee 5 లో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

విడుదలకు ముందు అనేక ఒడిదుడుకులను దాటుకొని కార్తికేయ 2 సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యింది. అయితే, కేవలం నామ మాత్రపు ధియేటర్ సంఖ్యలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే, కార్తికేయ 2 సినిమా ప్రేక్షకులను అమితంగా అక్కటుకోవడం మరియు సినిమాలో ఉన్న బలమైన కంటెంట్ కారణంగా కేవలం షోషల్ మీడియాలో నెటిజన్ల పబ్లిసిటీతోనే అతిభారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తికేయ 2 హిందీ వెర్షన్ ఇప్పటికీ మంచి కలక్షన్స్ సాధించడం విశేషం. అయితే, ఇప్పుడు ఈ సినిమా OTT రిలీజ్ గురించి ఆన్లైన్లో కొత్త విషయాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :