కార్తికేయ 2: నార్త్ లో పాగా వేసిన మరొక తెలుగు సినిమా.!

కార్తికేయ 2: నార్త్ లో పాగా వేసిన మరొక తెలుగు సినిమా.!
HIGHLIGHTS

నార్త్ లో పాగా వేసిన మరొక తెలుగు సినిమా కార్తికేయ 2

Karthikeya 2 విడుదలైన ప్రతి చోట భారీ హిట్ టాక్ తెచ్చుకుంది

నార్త్ లో ఈ సినిమా 300 కు పైగా స్క్రీన్స్ పైన ప్రదర్శించబడుతోంది

కార్తికేయ 2: నార్త్ లో పాగా వేసిన మరొక తెలుగు సినిమా కార్తికేయ 2. ఈ సినిమా మొదటి రోజు కేవలం ఐదు పదుల స్క్రీన్ ల పైన ప్రదిర్శించబడగా, రెండవ రోజు మరియు ఈరోజు కూడా రెట్టింపు స్క్రీన్ ల పైన ప్రదిర్శించబడుతోంది. 2014 లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తీసుకొచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోట భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మన తెలుగు రాష్టాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, నార్త్ లో కూడా ఈ సినిమా మంచి టాక్ తో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా నడుస్తోంది.

'కార్తికేయ 2' సినిమా ఆగష్టు 13న థియేటర్లలో విడుదలైంది. వాస్తవానికి, ఇద్దరు పెద్ద హీరోల సినిమాల రిలీజ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ రెండు సార్లు వాయిదా పడింది. అయితే, ఎట్టకేలకు ఆగష్టు 13న థియేటర్లలో రిలీజ్ చెయ్యబడింది. ఈ సినిమాను హిందీ లో కూడా డబ్ చేసిన నార్త్ లో అదే రోజున రిలీజ్ చేశారు. అయితే, అదే సమయంలో నార్త్ లో కూడా బాలీవుడ్ బిగ్ స్టార్స్ అమీర్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ సినిమాలు ఆడుతుండడంతో కార్తికేయ 2 సినిమాకు చాలా కొద్దీ స్క్రీన్స్ పైన మాత్రమే రిలీజ్ అయ్యింది.

అయితే, బాలీవుడ్ బిగ్ స్టార్స్ యొక్క సినిమాలు ఊహించిన స్థాయిలో ఆడకపోవడం కూడా ఈ సినిమాకు కలిసోచ్చినట్టుంది. అందుకే, మొదటి రోజు కేవలం ఐదు పదుల స్క్రీన్స్ పైన మాత్రమే రిలీజ్ అయిన కార్తికేయ 2 ఇప్పుడు రోజు రోజుకు మారిన్ స్క్రీన్స్ పైన రిలీజ్ చెయ్యబడుతోంది. ప్రస్తుతం, నార్త్ లో ఈ సినిమా 300 కు పైగా స్క్రీన్స్ పైన ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా యొక్క రివ్యూస్ మరియు పబ్లిక్ టాక్ తో మరిన్ని స్క్రీన్స్ ను ఈ సినిమా సొంతం చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo