కార్తికేయ 2: భారీగా పెరిగిన హిందీ వెర్షన్ షోలు..!

కార్తికేయ 2: భారీగా పెరిగిన హిందీ వెర్షన్ షోలు..!
HIGHLIGHTS

ప్రస్తుతం నార్త్ లో ఎక్కడ చూసిన కేవలం 'కార్తికేయ 2' ఒకే సినిమా పేరు వినిపిస్తోంది

కార్తికేయ 2 హిందీ వెర్షన్ ఊహించనంత ఎక్కువ రెస్పాన్స్ అందుకుంది

మరింత ఎక్కువ స్క్రీన్ లను సొంతం చేసుకుంటుందని నిపుణులు చెబుతునా

ప్రస్తుతం నార్త్ లో ఎక్కడ చూసిన కేవలం 'కార్తికేయ 2' ఒకే సినిమా పేరు వినిపిస్తోంది. నిఖిల్ సిధార్థ హీరోగా చెందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ ఊహించనంత ఎక్కువ రెస్పాన్స్ అందుకుంది. బాలీవుడ్ టాప్ స్టార్ యాక్టర్స్ అయిన అమీర్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ సినిమాలైన లాల్ సింగ్ చడ్డా మరియు రక్షా బంధన్ లను కూడా వెనక్కు నెట్టేసి కార్తికేయ 2 దూసుకుపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వాస్తవానికి, ఈ సినిమా ఎటువంటి అంచనాలు మరియు ప్రమోషన్స్ లేకుండా థియేటర్లలో విడుదలయ్యింది. కానీ సినిమాలో ఉన్న కంటెంట్ తో పాటుగా మరిన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాను ప్రేక్షకుల మనసులో నాటుకు పోయేలా చేశాయని, చుసిన ప్రతి ఒక్కరూ కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమా నార్త్ లో ఎంతగా ఆదరణ పొందిందంటే, నార్త్ లో కేవలం 60 షోలతో మొదలైన హిందీ వెర్షన్ ఈరోజు 1500 లకు పైగా షోలు రన్ అవుతున్నాయి.

నార్త్ లో హిందీ వెర్షన్ చూసిన ప్రేక్షకులు తెలుగు సినిమా గురించి మరియు ఈ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. ముఖ్యంగా, హీరో నిఖిల్ మరియు డైరెక్టర్ చందు మొండేటి లను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా మరింత ఎక్కువ స్క్రీన్ లను సొంతం చేసుకుంటుందని నిపుణులు చెబుతునారు. ఈ సినిమా ఇప్పటికే మేకింగ్ కోసం ఖర్చుపెట్టిన మొత్తం వసూలు చేయడమే కాకుండా లాభాల బాటను కూడా పట్టినట్లు సినిమా వారాగాలు చెబుతున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo