కార్తికేయ 2: నార్త్ లో బీభత్సం సృష్టిస్తున్న తెలుగు సినిమా..!!

Updated on 19-Aug-2022
HIGHLIGHTS

కార్తికేయ 2 నార్త్ లో బీభత్సం సృష్టిస్తున్న మరొక తెలుగు సినిమా

ఈరోజు పెద్ద హీరోల సినిమాలు ఆడుతున్న స్క్రీన్స్ సైతం ఆక్రమించుకోని చరిత్ర సృష్టించింది

హిందీ వెర్షన్ స్క్రీన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి

కార్తికేయ 2 నార్త్ లో బీభత్సం సృష్టిస్తున్న మరొక తెలుగు సినిమాగా కొనియాడ బడుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ హిందీ వెర్షన్ ఒక రేంజ్ లో ఆడుతోంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా మరియు అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ వంటి పెద్ద సినిమాలు అదే సమయంలో విడుదల కావండతో, కేవలం 50 స్క్రీన్ లను మాత్రం దక్కించుకున్న ఈ సినిమా ఈరోజు పెద్ద హీరోల సినిమాల ఆడుతున్న స్క్రీన్స్ సైతం ఆక్రమించుకోని చరిత్ర సృష్టించింది.

ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కార్తికేయ 2 సినిమా కోసం మరిన్ని స్క్రీన్ లు తెరుచుకున్నాయి. ఈరోజు 1000 కంటే ఎక్కువ స్క్రీన్స్ పైన హిందీ వెర్షన్ ప్రదర్శించబడుతోంది అంటే, అది మాములు విషయం కాదు. మొదటి రోజు ఈ సినిమాకు కేవలం 50 స్క్రీన్స్ మాత్రమే లభించగా, ఈరోజు 1000 స్క్రీన్స్ తో విరాజిల్లుతోంది.  ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన చూస్తుంటే, హిందీ వెర్షన్ స్క్రీన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే బాహుబలి 1&2, పుష్ప ది రైజర్ మరియు RRR బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన తెలుగు సినిమాలుగా లిస్ట్ లో కొనసాగుతుంటే, ఇప్పుడు కార్తికేయ 2 ఈ లిస్ట్ లో చేరిపోయింది. మరో పక్క, బాలీవుడ్ సినిమాలు ఆడుతున్న థియేటర్లలో ప్రేక్షకులు లేకపోవడంతో షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. రేపు వీకెండ్ కావడంతో రేపు మరిన్ని స్క్రీన్స్ జత కావచ్చని నిపుణులు చెబుతున్నారు.               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :