కార్తికేయ 2 రికార్డు స్థాయి కలక్షన్స్..!

Updated on 19-Sep-2022
HIGHLIGHTS

దిగ్విజయంగా సాగిపోతున్న కార్తికేయ 2

హిందీ వెర్షన్ భారీ కలక్షన్స్ సాధించడమే కాకుండా మరింత ముందుకు సాగిపోతోంది

ఈ సినిమా యొక్క OTT రిలీజ్ గురించి అనేక రూమర్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి

బాలీవుడ్ సినిమాలను సైతం పక్కకునెట్టి దిగ్విజయంగా సాగిపోతున్న కార్తికేయ 2 సినిమా రికార్డు స్థాయి కలక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రేపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్లలో హిందీ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ భారీ కలక్షన్స్ సాధించడమే కాకుండా మరింత ముందుకు సాగిపోతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పటికే 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా టోటల్ కలక్షన్ విషయానికి వస్తే, ఈ సినిమా మొత్తంగా 130 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించినట్లు నివేదికలు చెబుతన్నాయి.

ప్రారంభంలో మెల్లగా నడక సాగించి అనేక ఒడిదిడుకుల తట్టుకొని ఈ సినిమా ఈ స్థాయికి చేరుకుంది. మొదటి రోజు కేవలం 7 లక్షల రూపాయల ఓపెనింగ్ తో మొదలైన హిందీ వెర్షన్ ఈరోజు 30 కోట్లను రాబట్టగిలిగిందంటే, ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అంత స్ట్రాంగ్ గా వుంది మరి. ఈ సినిమా దెబ్బకి పెద్ద హీరోల సినిమాలు కూడా పక్కకు నెట్టబడ్డాయంటే, ఈ సినిమా ఆ రేంజ్ లో ఉందన్న మాట.

కార్తికేయ 2 ఇప్పటికి కూడా హిందీ బెల్ట్ లో నిలకడగా కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే కార్తికేయ 2 సినిమా మరొక మైలు రాయిని దాటవచ్చని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే, ఈ సినిమా యొక్క OTT రిలీజ్ గురించి అనేక రూమర్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజామా లేక అబద్దమో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :