JioTag Go: జియో కొత్త ప్రోడక్ట్ ను ఈరోజు లాంచ్ చేసింది. తాళాలు, పర్సులు, లగేజీ, మరియు మరిన్ని ఇతర వస్తువులను చాలా సులభంగా టాక్ చేయడానికి వీలైన GPS ట్రాకర్ ని విడుదల చేసింది. ఈ కొత్త ట్రాకర్ ను గూగుల్ ఫైండ్ మై డివైజ్ సపోర్ట్ తో అల్ట్రా కాంపాక్ట్ సైజులో అందించింది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే ఈ ట్రాకర్ ను కేవలం బడ్జెట్ ధరలోనే అందించింది. జియో సరికొత్తగా విడుదల చేసిన ఈ కొత్త పరికరం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా.
ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంగా ఏ వస్తువులు ఎక్కడ పెట్టామో త్వరగా గుర్తుకు రాదు. అటువంటి సమయంలో ఉపయోగపడే మొదటి వస్తువు GPS ట్రాకర్. ముఖ్యంగా కార్ తాళాలు, ఇంటి తాళాలు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు లగేజి వంటి వాటిని ట్రాక్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇటివంటి అవసరాలకు తగిన అన్ని ఫీచర్స్ తో జియో ఈ కొత్త జియో ట్యాగ్ గో ట్రాకర్ ను తీసుకు వచ్చింది. ఈ పరికరం ను ఏ వస్తువుకైనా జత చేస్తే, అది ఎక్కడ ఉన్న ఈజీగా కనిపెట్టవచ్చు. ఈ ట్రాకర్ ను Google Find My Device App తో అందించింది. ఈ యాప్ ద్వారా ఎక్కడ నుంచైనా జియో ట్యాగ్ గో ని జత చేసిన డివైజ్ ను వెతికి పట్టుకోవచ్చు.
మరింత సౌకర్యమైన విషయం ఏమిటంటే, ఈ జియో ట్రాకర్ 1 సంవత్సరం పనిచేసే బ్యాటరీ తో వస్తుంది. అంతేకాదు, ఈ బ్యాటరీ అయిపోగానే కొత్త బ్యాటరీని మార్చుకోవచ్చు. అంతేకాదు, ఈ జియో GPS ట్రాకర్ పరికరం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ట్రాక్ అవుతుంది. ఇందులో ఎటువంటి SIM లేదా మరింకేదైనా సెటప్ కూడా అవకాశం ఉండదు. ఈ పరిరకం తో Lost Mode ని ఎనేబుల్ చేస్తే Find My Device నెట్ వర్క్ లోకి రాగానే వెంటనే ఆటోమాటిగ్గా నోటిఫికేషన్ అందిస్తుంది.
Also Read: 8 వేల బడ్జెట్ లో మంచి Smart TV కొనాలనుకుంటున్నారా.. ఒక లుక్కేయండి.!
జియో ఈ కొత్త పరికరం జియో ట్యాగ్ గో ను రూ. 1,499 రూపాయల ధరకే అందించింది. ఈ కొత్త పరికరం అమెజాన్, జియో వెబ్సైట్, జియో మార్ట్ మరియు రిలయన్స్ డిజిటల్ నుంచి లభిస్తుంది.