JIO యొక్క మరొక ధమాఖా , తక్కువ ధరలో లభిస్తున్న ఈ ప్రోడక్ట్…

JIO యొక్క మరొక ధమాఖా , తక్కువ ధరలో లభిస్తున్న ఈ ప్రోడక్ట్…

రిలయన్స్ JIO  వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ . JioFi లైనప్ ని  జియో విస్తరించింది, కంపెనీ  JioFi 4G LTE హాట్స్పాట్ డివైస్ ని  ప్రారంభించింది. దీని ధర 999 రూపాయలు. జియో కొత్త మోడల్ కి  JioFi JMR815 గా పేరు పెట్టింది. మీరు కొనుగోలు కోసం  ఆసక్తి ఉంటే అప్పుడు మీరు Flipkart నుండి ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ దీనిపై  ఒక సంవత్సరం  వారంటీ ఇస్తోంది. దీని డౌన్ లోడ్ స్పీడ్  150 Mbps మరియు అప్లోడ్ స్పీడ్  50 Mbps.జియో తన ఈ డివైస్ కి  'భారతదేశం లో డిజైన్' ట్యాగ్లైన్ ఇచ్చింది. కొత్త జియోఫై  మోడల్ గోళాకార డిజైన్ తో రూపొందించబడింది. మొట్టమొదట జియోఫై ను ఓవల్ ఆకారంలో తీసుకువచ్చారు. ఇందులో పవర్ ఆన్ / ఆఫ్ మరియు WPS (Wi-Fi ప్రొటెక్టెడ్ సెటప్) వంటి ఫిజికల్  బటన్లు ఉన్నాయి, దీనిలో బ్యాటరీ 4G మరియు Wi-Fi సిగ్నల్స్ కి  నోటిఫికేషన్ లైట్ అందించబడుతుంది.

ఇది ఒక సమయంలో 32 వినియోగదారులను కనెక్ట్ చేయగలదు . దీనిలో  31 Wi-Fi మరియు 1 USB ద్వారా కనెక్ట్ చేయవచ్చు. కనెక్ట్ చేసిన తరువాత, స్మార్ట్ ఫోన్ పై జియో  4G వాయిస్ యాప్  ద్వారా HD వాయిస్ మరియు వీడియో కాల్స్ అందుకోగలదు.

అదనంగా, ఇది ALT3800 వాయిస్ ప్రాసెసర్ ని  కలిగి ఉంది మరియు ఇది FDD- బ్యాండ్ 3, బ్యాండ్ 5 మరియు TDD- బ్యాండ్ 40 లను సపోర్ట్ చేస్తుంది . ఇది ఒక జియోఫై కార్డ్  స్లాట్ ని  కలిగి ఉంటుంది, దీని స్టోరేజ్  64 GB వరకు విస్తరించబడుతుంది.300mAh పవర్ బ్యాటరీ జియో ఫై  లో ఇవ్వబడుతుంది. కంపెనీ వాదన ప్రకారం దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది మూడున్నర గంటలపాటు కొనసాగుతుంది. 

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo