Jio Space Fiber: ఇండియా యొక్క మొట్ట మొదటి శాటిలైట్ ఆధారిత గిగాబిట్ బ్రాడ్ బ్యాండ్ ప్రదర్శించిన జియో.!
మొదటి శాటిలైట్ ఆధారిత గిగాబిట్ బ్రాడ్ బ్యాండ్ ప్రదర్శించిన జియో
Jio Space Fiber ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ వేదికగా ప్రదర్శించింది
భారతీయ యూజర్లకు వేగవంతమైన మరియు స్థిరమైన సేవలను అందిస్తున్న రిలయన్స్ జియో
రిలయన్స్ జియో ఈరోజు ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2023) నుండి ఇండియా యొక్క మొట్ట మొదటి శాటిలైట్ ఆధారిత గిగాబైట్ బ్రాడ్ బ్యాండ్ ను విజయవంతంగా ప్రదర్శించింది. ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్ లైన్ మరియు వైర్లెస్ సర్వీస్ ల ద్వారా 450 మిలియన్ల మంది భారతీయ యూజర్లకు వేగవంతమైన మరియు స్థిరమైన సేవలను అందిస్తున్న రిలయన్స్ జియో, దేశంలోని ప్రతీ అట్టడుగు ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించే దేశగా ఈ కొత్త Jio Space Fiber అడుగులు వేస్తుందని చెబుతోంది.
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ వేదికగా ఈ మొదటి భారతీయ శాటిలైట్ ఆధారిత గిగాబిట్ బ్రాండ్ బ్యాండ్ ను విజయంతంగా ప్రదర్శించింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కొత్త టెక్నాలజీ జియో స్పేస్ ఫైబర్ ఆవిష్కణ మరియు ప్రోడక్ట్స్ ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ దగ్గరుండి వివరించారు.
Jio Space Fiber
ఈరోజు ఢిల్లీ లోని ప్రగతీ మైదాన్ లో ప్రారంభమైన India Mobile Congress (IMC 2023) లో ప్రపంచ అతిపెద్ద ప్రైవేట్ మొబైల్ డేటా నెట్వర్క్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (Reliance Jio Infocomm Limited) ఇండియాలో ఉన్న ప్రతీ ప్రాంతానికి వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించడాని చేస్తున్న కృషిలో భాగంగా ఈ జియో స్పేస్ ఫైబర్ ను ఆవిష్కరించింది.
Also Read : Great Offer: Flipkart Sale నుండి 17 వేలకే బ్రాండ్ న్యూ 43 ఇంచ్ 4K UHD టీవీ ఆఫర్.!
దేశంలోని లక్షల కొద్దీ ప్రజల ఇళ్లు మరియు వ్యాపారాల్లో వేగవంతమైన బ్రాండ్ బ్యాండ్ లను సేవలను అందించిన జియో, ఇప్పుడు ఈ జియో స్పేస్ ఫైబర్ తో మరిన్ని లక్షల మంది ప్రజలను కనెక్టెడ్ చేస్తామని, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
స్పేస్ నుండి నేరుగా వేగవతమైన ఇంటర్నెట్ ను దేశంలోని మూల మూలకు ఎటువంటి ఆటంకం మరియు అంతరాయం లేకుండా గిగాబిట్ వేగంతో ప్రజలకు అందించడానికి ఈ జియో స్పేస్ ఫైబర్ సహాయ పడుతుందని తెలిపారు.