రిలయన్స్ జియో తన సొంత, డేటా సెంట్రిక్ నెట్ వర్క్ ను ప్రారంభించి, భారతీయ టెలికాం పరిశ్రమలో కష్టాలు సృష్టించింది. ప్రయోగించిన మొదటి 6 నెలలకు ఉచిత సేవను ప్రారంభించినందున ఈ ప్లాన్ ఎంతో ప్రాచుర్యం పొందింది మరియు 6 నెలల తర్వాత, జియో 99 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ లాంచ్ అయ్యింది.
జియో మెంబర్షిప్ రేపటితో ముగియనుంది, మార్చి 31 అనగా రేపటి వరకు ఇది వాలిడ్ . అంటే, సబ్స్క్రిప్షన్ యొక్క తేదీ కేవలం రేపటి వరకు మాత్రమే, మరియు దీనితో, జియో ఈ క్రొత్త ప్రకటనను విడుదల చేస్తుందని ఇప్పటివరకు ప్రజలు ఆశించారు .
అయితే ఇంకా దీని గురించి అధికారిక సమాచారం లేకపోవటం తో ,జియో యూజర్స్ కొద్దిగా సందిగ్ధం లో వున్నారు , జియో తరచుగా వారి కొత్త ప్లాన్ ల తో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది , మరియు సబ్స్క్రిప్షన్ ముగిసేలోపు ప్రజల కంపెనీ వినియోగదారులకు ఎదో ఒక ఫ్రీ ఆఫర్ ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నారు .
ఇక్కడ వినియోగదారులు ప్రైమ్ మెంబర్షిప్ లో ఏమి పొందుతారు: –
ఒక ఏడాది వరకు ప్రతీ రోజు 10 రూపీస్ కి ఉచిత అన్లిమిటెడ్ డేటా మరియు వాయిస్ సర్వీసెస్.
అదనపు డేటా మరియు వాలిడిటీ తో ప్రత్యేక రీఛార్జి ప్లాన్స్.
ఏ నెట్వర్క్లోనైనా ఉచిత VoLTE వాయిస్ కాల్,రోమింగ్ ఫ్రీ .
జియో యాప్స్ కోసం ఫ్రీ యాక్సెస్ ఫెసిలిటీ .