jio యూజర్స్ కి తీయటి వార్త
భారత టెలికాం రంగం లో jio ఒక సంచలనం , 2016 సెప్టెంబర్లో తమ 4G సేవలు ప్రారంభించి దాదాపు 6 మాసాల పాటు ఫ్రీ ఆఫర్స్ ఇవ్వటమనేది మామూలు విషయం కాదు అది కేవలం JIO కి మాత్రమే సాధ్యమైంది. కానీ JIO గడువు కాలం ఈ నెల మార్చ్ 31 తో ముగియనుంది. అయితే కస్టమర్స్ ను కాపాడుకోవటానికి JIO ప్రైమ్ మెంబర్షిప్ ను ప్రవేశ పెట్టింది. అంటే కేవలం 99 రూ రీఛార్జి చేసుకోవటం ద్వారాగా 1 ఇయర్ వాలిడిటీ ఇస్తుంది. చాలా మంది యూజర్స్ ఆల్రెడీ jio ప్రైమ్ మెంబర్షిప్ లో సభ్యులయ్యారు . కానీ ఇంకా చాల మంది యూజర్స్ ఇందులో ఇంకా మెంబర్షిప్ పొందలేదు . మార్చ్ 31 తరువాత "jio ప్రైమ్ " మరియు jio రెండు విభాగాలు కానీ టైం అయిపోయిందని చాలా మంది కంగారు పడుతున్నారు , అలాంటి వారికి గుడ్ న్యూస్ jio సబ్ స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం . మరో 2 డేస్ లో ఈ విషయం ఫై ప్రకటించవచ్చు. అయితే అసలు విషయం ఏమిటంటే యూజర్స్ కోసం jio ఈ నిర్ణయం తీసుకోవట్లేదు . ఇప్పటివరకు jio ప్రైమ్ మెంబర్షిప్ కి కంపెనీ అనుకున్నంత స్థాయిలో సబ్ స్క్రిప్షన్స్ రాలేదు కేవలం 5 కోట్ల మంది మాత్రమే సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా గడువు పెంచితే మిగతా 5 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ చేరుతారనే ఉద్దేశ్యం తో jio ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం
భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.