జియో వినియోగదారులకు మంచి వార్త . రిలయన్స్ తన జియోఫోన్ ప్రీ బుకింగ్ చేయటం మరలా ప్రారంభించింది. అయితే, ఈ సమయం కొంతమంది మాత్రమే వినియోగదారులు ఈ ఫోన్ ని బుక్ చేయగలరు. న్యూస్ ఏజెన్సీ PTI ప్రకారం, జియో ఫోన్స్ ని వెబ్ సైట్ లో గతంలో 'ఇంట్రెస్ట్ రిజిస్ట్రేషన్' చేసిన వినియోగదారులు మాత్రమే బుక్ చేయగలరు.గతంలో బుకింగ్ సందర్భంగా ఈ ఫోన్ ని బుక్ చేయలేకపోయిన వారికి, తమ వెబ్సైట్లో "ఇంట్రెస్ట్ రిజిస్ట్రేషన్" చేసుకునే ఒక ఎంపికను కంపెనీ అందించింది, ఇప్పటికీ కొనసాగుతోంది. కంపెనీ ఈ రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఛార్జ్ చేయడం లేదు.
రిపోర్ట్స్ ప్రకారం, ఈ మెసేజ్ ద్వారా ఫోన్ యొక్క ప్రీ రిజిస్ట్రేషన్ గురించి సమాచారం పంపుతోంది. మెసేజ్ లో, "JioPhone లో ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు సమాచారం ఇస్తుంది – టీం జియో " ఈ మెసేజ్ కూడా మిమ్మల్ని వెబ్సైట్కు తీసుకువెళ్ళే లింక్ను కలిగి ఉంది.ఫోన్ ప్రీ బుకింగ్ రిజిస్ట్రేషన్ కోసం, కంపెనీ సైట్ కి వెళ్లి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID మరియు పిన్ కోడ్ వంటి కొన్ని వివరాలను నమోదు చేయండి. దీని తరువాత యూజర్ కి నిర్ధారణ మెయిల్స్ మరియు మెసేజ్ వస్తాయి . ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటినీ ఈ ఫోన్ ప్రీ బుకింగ్ చేయబడుతుంది. ప్రీ-బుకింగ్లో 500 రూపాయల డిపాజిట్ చేసిన వ్యక్తులకు లింక్ మరియు ఫోన్ డెలివరీ తేదీ గురించి సమాచారం పంపబడుతుంది.