Jio Pay: పేటిఎం కి పోటీగా Jio Payment కోసం సౌండ్ బాక్స్ తీసుకు వస్తోంది.!
Jio Payment కోసం సౌండ్ బాక్స్ తీసుకు వస్తోంది
పేటిఎం కి పోటీగా జియో కొత్త స్మార్ట్ స్పీకర్ ను తీసుకు వస్తోంది
ఈ సర్వీస్ లను దేశవ్యాప్తంగా జియో విస్తరిస్తుందని తెలుస్తోంది
Jio Pay: పేటిఎం కి పోటీగా Jio Payment కోసం సౌండ్ బాక్స్ తీసుకు వస్తోంది. గత కొంత కాలంగా RBI నుండి ఎదురు దెబ్బలు తింటున్న పేటిఎం కి పోటీగా జియో కొత్త స్మార్ట్ స్పీకర్ ను తీసుకు వస్తోంది. పేటిఎం కి పోటీగా గూగుల్ మరియు ఫోన్ పే వంటి పేమెంట్ గేట్ వేస్ ఇప్పటికే వారి సౌండ్ బాక్స్ లను మరింతగా విస్తరించే పనిలో పడ్డాయి. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జియో బాక్స్ న్యూస్ మార్కెట్ లో ఇప్పుడు మరింత ఆశక్తి రేకెత్తించింది.
Jio Pay: sound box
ఆన్లైన్ ప్రెమెంట్స్ కోసం పేటిఎం, గూగుల్ మరియు ఫోన్ పే వంటి వాటికి పోటీగా Jio Payments Bank ని తీసుకు వచ్చింది. అయితే, ఈ జియో పెమెంట్స్ బ్యాంక్ ని మరింత వేగంగా విస్తరించడానికి పేమెంట్ నోటిఫికేషన్ బాక్స్ అవసరంగా భావిస్తోంది. అందుకే, ఈ మూడు ఫైన్ టెక్ లకు పోటీగా సొంత సౌండ్ బాక్స్ ను తీసుకు వచ్చే పనిలో పడింది.
అంతేకాదు, ఈ జియో పేమెంట్ సౌండ్ బాక్స్ ను ప్రధాన టైర్ నగరాలైన లక్నో, ఇండోర్ మరియు జైపూర్ వంటి మరిన్ని నగరాలలో ఉన్న జియో రిటైల్ స్టోర్ లలో వీటిని టెస్ట్ చేయడం కూడా చూస్తోంది. ఈ టెస్టింగ్ తరువాత ఈ సర్వీస్ లను దేశవ్యాప్తంగా జియో విస్తరిస్తుందని తెలుస్తోంది.
Also Read: POCO X6 Neo 5G: 108MP డ్యూయల్ కెమేరాతో వచ్చింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
పేమెంట్ గేట్ వై అందిస్తున్న సౌండ్ బాక్స్ లు అందుకున్న పేమెంట్ లను రియల్ టైం లో ఇన్స్టాంట్ గా తెలియ పరుస్తాయి. అంటే, ఇచ్చి పుచ్చుకునే విధంగా చాలా వేగంగా ఉండడంతో పాటుగా మరింత క్లియర్ గా ఉంచడంలో ఈ సౌండ్ బాక్స్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే, పేటిఎం, ఫోన్ పే మరియు గూగుల్ పే వంటి పెద్ద పేమెంట్ గేట్ వేస్ వీటికి పెద్ద పీట వేశాయి.
Jio Payment
ఇప్పుడు ఇదే దారిలో జియో కూడా తన సౌండ్ బాక్స్ లను తీసుకు రావడానికి తొందర పడుతోంది. జియో తీసుకు వచ్చిన జియో పే UPI యాప్ ఇప్పటికే మంచి సర్వీస్ లను ఆఫర్ చేస్తున్నట్లు గుర్తించబడింది. ఇరాక్ ఈ ఈ జియో పే సౌండ్ బాక్స్ కూడా వస్తే, ఇది గట్టి పోటీగా మార్కెట్ లో నిలిచే అవకాశం వుంది.