jio Rs. 399 రీఛార్జ్ పై బెనిఫిట్ …

jio  Rs. 399 రీఛార్జ్ పై  బెనిఫిట్ …

జియో తన ప్రైమ్ మెంబెర్స్ కి   రెండోసారి క్యాష్  బ్యాక్ ఆఫర్ ఇస్తుంది . దీపావళికిఒక  క్యాష్ బ్యాక్ ఆఫర్ తెచ్చింది. ఇప్పుడు, జియో యొక్క కొత్త ఆఫర్ కింద, వినియోగదారులు 2,599 రూపాయల లాభం పొందుతారు. జియో యొక్క కొత్త క్యాష్ బ్యాక్  ఆఫర్ మొత్తం 399 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జిలో అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రయోజనం నవంబర్ 10 నుండి నవంబరు 25 వరకు అందుబాటులో ఉంటుంది. రాబోయే జియో క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద, మై జియో  మరియు జియో.కాం సైట్ నుండి 399 లేదా అంతకు మించిన  రీఛార్జ్  చేసిన యూజర్స్  400 రూపాయల క్యాష్  బ్యాక్ ను పొందుతారు, ఈ క్యాష్ బ్యాక్  50 రూపాయల 8 వోచర్లు రూపంలో అందుబాటులో ఉంటాయి. అదనంగా, మీరు డిజిటల్ వాలెట్ తో రీఛార్జి చేస్తే, అక్కడ కూడా క్యాష్ బ్యాక్ పొందుతారు .

ఉదాహరణకు, మీరు జియో నెట్ వర్క్ లో ఒక కొత్త యూజర్ గా  చేరి  మరియు అమెజాన్ పే ఉపయోగించి రూ 459 రీఛార్జి చేస్తే, మీరు 400 రూపాయల క్యాష్ బ్యాక్ తో పే బ్యాలెన్స్ రూపం లో 99 రూపాయల క్యాష్ బ్యాక్ పొందుతారు, అనగా మొత్తం  499 రూపాయల క్యాష్ బ్యాక్  లభిస్తుంది.క్యాష్ బ్యాక్  మాత్రమే కాకుండా, జియో  మరింత లాభాలను ఇస్తుంది . ఆఫర్ యొక్క మొత్తం విలువ 2,599 రూపాయలు ఉంటుంది. క్యాష్బ్యాక్ ఆఫర్ కింద, మీరు AJIO.com నుండి 1500 రూపాయల లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సక్షన్స్  ద్వారా రూ .399 డిస్కౌంట్ పొందుతారు. అదే సమయంలో, రిలయన్స్ ట్రెండ్ .కాం నుంచి రూ. 1,999 లేదా అంతకన్నా ఎక్కువ కొనుగోలుతో 500 రూపాయల వెంటనే డిస్కౌంట్ పొందుతారు .దీనితో పాటుగా, జియో కూడా యాత్రా .com తో పార్టనర్ షిప్ ని  కలిగి ఉంది. కాబట్టి మీరు ఈ వెబ్ సైట్ నుండి రౌండ్ ట్రిప్ కోసం ఒక డొమెస్టిక్ ఫ్లయిట్  టికెట్ ని  బుక్ చేసుకుంటే, మీకు రూ .1000 క్యాష్  బ్యాక్  మరియు ఒక-వైపు  టికెట్ కోసం 500 రూపాయల తగ్గింపు లభిస్తుంది.

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo