రిలయన్స్ జియో ఎప్పుడైతే టెలికాం మార్కెట్ లోకి అడుగుపెట్టిందో ఇండియా లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి . మొత్తం 6 నెలలు నిర్విరామంగా జియో తన సర్వీసెస్ ని యూజర్స్ కి ఉచితంగా అందించింది . అందుకే మిగతా టెలికాం కంపెనీ లు కూడా దిగివచ్చి ఎప్పుడూ ఇవ్వని విధంగా అతి తక్కువ ధరలకే డేటా బెనిఫిట్స్ ని యూజర్స్ కి అందిస్తున్నారు . అయితే తాజాగా లండన్ లోని వైర్‌లెస్ కవరేజ్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ యొక్క రిపోర్ట్ ప్రకారం వచ్చే 2018 ఇయర్ లో జియో కి సంభందించిన అన్ని డేటా ప్లాన్స్ ధరలు పెరగనున్నాయి . అయితే దీని గురించి రిలయన్స్ కంపెనీ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు .