రిలయన్స్ జియో మరొక గుడ్ న్యూస్ అందించబోతోందా..!

Updated on 28-Aug-2022
HIGHLIGHTS

రేపు జరగనున్న రిలయన్స్ జియో AGM

జియో గుడ్ న్యూస్ ప్రకటించవచ్చని తెలుస్తోంది

5G నెట్ వర్క్, Jio 5G Phone ను కూడా లాంచ్ చేస్తుందని చెబుతున్నారు

రేపు జరగనున్న రిలయన్స్ జియో AGM (వార్షిక సాధారణ సమావేశం) లో గుడ్ న్యూస్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్నా కధనాలు మరియు అంచనాల ద్వారా, జియో ఈ మీటింగ్ నుండి చాలా ప్రోడక్ట్ లను లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా Jio 5G నెట్ వర్క్ మరియు Jio 5G Phone ఉండనున్నాయి. ప్రతీ సంవత్సరం మాదిరిగానే జియో యొక్క ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ నుండి మరిన్ని కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుందని ఊహిస్తున్నారు.     

ఇక ఈ ఆన్లైన్లో వస్తున్న నివేదికలను విస్వసిస్తే, అప్ కమింగ్ Jio 5G Phone ఎటువంటి వివరాలను కలిగి ఉంటుంది మరియు ఇంకా ఎటువంటి ప్రకటనలను చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం కంపెనీ 5G నెట్ వర్క్ తో పాటుగా Jio 5G Phone ను కూడా లాంచ్ చేస్తుందని చెబుతున్నారు. అంటే, రేపు మధ్యాహ్నం జరగనున్న రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ నుండి Jio 5G ఫోన్‌లతో పాటు కొన్ని ఎంపిక చేసిన నగరాలు లేదా ప్రాంతాలలో తన సూపర్‌ఫాస్ట్ 5G సేవను కూడా జియో అందించవచ్చు. అయితే, ఇవన్నీ కూడా అంచనా వేసి చెబుతున్న విషయాలు మాత్రమే. జియో ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని గమనించండి.

Jio 5G Phone: అంచనా స్పెక్స్

కొన్ని నివేదికల ప్రకారం, Jio 5G ఫోన్ 6.5-అంగుళాల డిస్ప్లేని సాధారణ HD రిజల్యూషన్ ప్యానెల్ తో కలిగిఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, అప్ కమింగ్  Jio 5G ఫోన్ 4GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ పాటు, Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌ తో రావచ్చని ఊహిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనీసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అమర్చవచ్చు.

అలాగే, Jio 5G ఫోన్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో పాటుగా 13MP మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉండవచ్చు. అయితే, ఇవన్నీ కూడా ముందస్తు అంచనా స్పెక్స్ మాత్రమే. జియో అధికారికంగా జియో 5G ఫోన్ ను వెల్లడించినప్పుడు చూడాలి ఫోన్ యుగాల ఉంటుందో.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :