Jio 5G: హైదరాబాద్ లో 1Gbps స్పీడ్ తో 5జి సర్వీస్..మీ ఫోన్ లో ఇలా సెట్ చేసుకోండి.!

Updated on 09-Mar-2023
HIGHLIGHTS

హైదరాబాద్ లో 1Gbps స్పీడ్ తో 5జి సర్వీస్ లను రిలయన్స్ జియో ప్రారంభించింది

జియో తన 5G సర్వీస్ కలిగిన నగరాల్లో హైదరాబాద్ ను జత చేసింది

4G ప్లాన్స్ పైనే 5G సర్వీస్ లను కస్టమర్లకు అఫర్ చేస్తోంది

Jio 5G: హైదరాబాద్ లో 1Gbps స్పీడ్ తో 5జి సర్వీస్ లను రిలయన్స్ జియో ప్రారంభించింది. ఈ నెల 10న జియో తన 5G సర్వీస్ కలిగిన నగరాల్లో హైదరాబాద్ ను జత చేసింది. జియో కస్టమర్లకు ఎవరికైతే 5G నెట్ వర్క్ కోసం ఆహ్వానం వస్తోందో, వారు 5G నెట్ వర్క్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు, దీనికోసం ఎటువంటి అదనపు రుసుమును కూడా చెల్లించవలసిన పనికూడా లేదు. వాస్తవానికి, జియో తన Jio True 5G సర్వీస్ లను మరింత వేగంగా విస్తరిస్తోంది. మొదట ప్రారంభించిన ఆరు నగరాల తరువాత ఇప్పుడు హైదరాబాద్  మరియు బెంగళూరు నగరాలు కూడా Jio True 5G సర్వీస్ పొందిన నగరాల జాబితాలో చేరాయి.

రిలయన్స్ జియో, ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి దశలవారీగా అధునాతన ట్రూ 5G సేవలను అందిస్తోంది. ప్రస్తుత సర్వీస్ అందుబాటు విషయానికి వస్తే, జియో ట్రూ 5G ఇప్పటికే ఆరు నగరాల్లోని లక్షల మంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.             

ఇక ఈ  జియో ట్రూ 5G అందిస్తున్న స్పీడ్ విషయానికి వస్తే, Jio వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ లలో 500 Mbps (Mbps) నుండి 1 Gbps వరకు స్పీడ్ పొందుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కొత్త 5G ప్లాన్ లను ఇంకా తీసుకు రాకపోయినా 4G ప్లాన్స్ పైనే 5G సర్వీస్ లను కస్టమర్లకు అఫర్ చేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లోని జియో యూజర్లకు కూడా ఈ 5G సర్వీస్ ను అనుభవించే అవకాశం దక్కింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :