ముందుగా పైన ఉన్న ఇమేజ్ ఓల్డ్ మోడల్. కొత్త మోడల్ కూడా same ఇలానే ఉంటుంది కాని కొంచెం పెద్ద సైజ్. ప్రస్తుతానికి కొత్త మోడల్ పిక్స్ లేవు అని మీకు తెలియజేయదలుచుకున్న.
రిలయన్స్ సరికొత్త JioFi 4G WiFi హాట్ స్పాట్ డివైజ్ ను రిలీజ్ చేసింది మార్కెట్ లో. దీని ప్రైస్ 1999 రూ. దీని కన్నా ముందు ఆల్రెడీ JioFi 2(రివ్యూ) పేరుతో ఆల్రెడీ ఒక డివైజ్ ఉంది. (2,899 రూ ఉండేది లాంచ్ అయిన కొత్తలో)
ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన JioFi 4G JioFi2 కు అప్ గ్రేడ్ వేరియంట్/మోడల్. రెండూ ఒకే ప్రైస్. కొత్త మోడల్ లో OLED డిస్ప్లే ఉంది. పాత మోడల్ అయిన JioFi2 లో డిస్ప్లే లేదు.
OLED డిస్ప్లే లో పవర్ ఆన్ అండ్ ఆఫ్, నెట్ వర్క్ strength, WiFi సిగ్నల్ స్టేటస్ etc చూపిస్తుంది. అలాగే బ్యాటరీ కూడా 2300 నుండి 2600 mah కు పెరిగింది కొత్త డివైజ్ లో.
JioFi 2 లో glossy మేటేరియాల్ ఉండేది. JioFi4G లో matte ఫినిషింగ్ తో polycarbonate బాడీ ఉంది. టోటల్ 10 డివైజెస్ ను కనెక్ట్ చేయగలదు. కాని పాత మోడల్ 31 డివైజెస్ ను కనెక్ట్ చేయగలదు అని కంపెని ఇన్ఫర్మేషన్.
JioFi 4G లో Jio సిమ్ వేసుకొని, wifi హాట్ స్పాట్ పద్దతిలో మిగిలిన wifi కలిగిన డివైజెస్ కు కనెక్ట్ చేసుకోగలరు. అంటే స్మార్ట్ టీవీ, ఫోన్స్, లాప్ టాప్స్ etc.
JioFi 4G ను రిలయన్స్ స్టోర్స్ లోకి వెళ్లి కొనగలరు. అయితే సెలెక్టెడ్ సిటీస్ లోనే దీని అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. JioFi 2 మొదటి డివైజ్ – రివ్యూ