Jio Coin could be next Craze in cryptocurrency what reports saying
Jio Coin: ముకేశ్ అంబానీ మరొక సారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో తో దేశీయ టెలికాం మార్కెట్ లో ఇప్పటికే సునామీ సృష్టించిన అంబానీ, ఇప్పుడు క్రిప్టోకరెన్సీ మార్కెట్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు. అసలే అపర కుబేరుడు అందులోనూ సూపర్ స్ట్రాటజీ బిజినెస్ మ్యాన్ గా కితాబు అందుకున్నారు. అటువంటి అంబానీ నేతృత్వంలోని JIo Coin మార్కెట్ లోకి అడుగు పెడుతుంది అంటే దాని పై అంచనాలు ఆకాశంలో ఉండటం సహజమే అంటున్నారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిట్ కాయిన్ మాదిరిగా అంబానీ కూడా జియో కాయిన్ ను తీసుకువచ్చారు. ఇదేదో ఆశామాషీగా తీసుకువచ్చారు అనుకోకండి. ఈ జియో కాయిన్ ను ప్రముఖ క్రిప్టోకరెన్సీ ప్లాట్ ఫామ్, పాలిగావ్ Polygon ల్యాబ్స్ తో జతగా తీసుకు వచ్చింది. పాలిగావ్ Polygon ల్యాబ్స్ బ్లాక్ చైన్ కేంద్రిత ప్లాట్ ఫామ్ మరియు జియో కాయిన్ కూడా ఇదే దారిలో వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ జియో కాయిన్ ను Jio Sphere వెబ్ బ్రౌజర్ లో బ్రౌజ్ చేసే యూజర్స్ కి ఫ్రీ రివార్డ్ పాయింట్స్ రూపంలో అందిస్తోంది. అందిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, త్వరలోనే ఈ కాయిన్స్ ను డెస్క్ టాప్ వెర్షన్ కి కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో ప్రకటించింది. అయితే, త్వరలోనే జియో యొక్క అన్ని యాప్స్ మరియు ప్లాట్ ఫామ్ లపై ఈ జియో కాయిన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఈరోజు నుంచి మొదలైన అమెజాన్ Smart Tv సేల్: Xiaomi 65 ఇంచ్ స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్.!
ముందుగా ఈ జియో కాయిన్స్ ను రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ పై రీఛార్జ్ చేయడానికి, షాపింగ్ మరియు రిలియన్స్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కోసం రీడిమ్ చేసుకునే అవకాశం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, రానున్న రోజులో దీన్ని పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.
ఇదే కనుక నిజం అయితే, జియో కాయిన్ ఇండియన్ మార్కెట్ లో చాలా వేగంగా ;పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ జియో కాయిన్ ను ఎలా నిర్వహిస్తారు మరియు వీటికోసం ప్రత్యామ్నాయంగా వాడతారు అనే విషయాలు కీలక అంశాలు అవుతాయి.