Jio Cinema Premium: కేవలం రూ. 29 కే 4K కంటెంట్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తెచ్చింది.!

Updated on 25-Apr-2024
HIGHLIGHTS

Jio Cinema Premium కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రకటించింది

నెలకు కేవలం రూ.29 రూపాయల చెల్లింపుతో జియో సినిమా ప్రీమియం

యాడ్స్ బెడద లేకుండా Ad Free కంటెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు

Jio Cinema కోసం ఈరోజు Jio Cinema Premium సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రకటించింది. ముందుగా నెలకు రూ. 99 రూపాయల ధరలో జియో సినిమా ప్రీమియం ప్లాన్ ను అందించింది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా కొత్త జియో సినిమా ప్రీమియం ప్లాన్ ను నెలకు కేవలం రూ. 29 రూపాయల చెల్లింపుతో ప్రకటించింది. అంటే, నెలకు కేవలం రూ.29 రూపాయల చెల్లింపుతో జియో సినిమా యొక్క ప్రీమియం లాభాలను యూజర్లు అందుకోవచ్చు.

రిలయన్స్ జియో సారధ్యంలో జియో తీసుకు వచ్చిన OTT ప్లాట్ ఫామ్ జియో సినిమా కొత్త ప్లాన్ ను ఈరోజు జియో లాంఛ్ చేసింది. ఈ కొత్త ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను నెలకు రూ. 29 రూపాయల ధరతో లాంఛ్ చేసింది. ఈ కొత్త ప్రీమియం ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకునే యూజర్లు యాడ్స్ బెడద లేకుండా Ad Free కంటెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు.

ఏమిటి Jio Cinema Premium కొత్త ప్లాన్ అందించే ప్రయోజనాలు?

జియో సినిమా ప్రీమియం కొత్త ప్లాన్ తో Ad Free ఎక్స్ పీరియన్స్ అదీకూడా 4K క్వాలిటీ మరియు ఆఫ్ లైన్ లో కూడా లభిస్తుంది. ఈ కొత్త ప్లాన్ తో కేవలం రూ. 29 రూపాయలకే 4K కంటెంట్ ను సైతం ఆఫర్ చేస్తున్న మొదటి OTT ప్లాట్ ఫామ్ గా జియో సినిమా చరిత్ర సృష్టించింది.

Jio Cinema Premium

ఈ కొత్త ప్లాన్ తో Exclusive సిరీస్ లు, సినిమాలు, Hollywood, Kids మరియు TV entertainment లను టీవీలతో పాటుగా ఏ డివైజ్ లి అయినా చూడవచ్చు. జియో ఈ చవక ప్రీమియం ప్లాన్ తో పాటుగా మరింత చవక ‘Family Plan’ ని కూడా అందించింది.

Also Read: Gold Price Live: పసిడి ప్రియులకు ట్విస్ట్ .. మళ్ళీ పెరుగు గోల్డ్ రేట్.!

Jio Cinema Premium Family Plan

జియో సినిమా ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ ను కూడా జియో ఈరోజు ప్రకటించింది. ఈ ప్లాన్ ను కేవలం నెలకు రూ. 89 రూపాయల చవక ధరకే అందించింది. ఈ ప్లాన్ తో ఒకేసారి 4 స్క్రీన్స్ పైన జియో సినిమా ప్రీమియం కంటెంట్ ను చూసే వీలుంటుంది. అంటే, Peacock, HBO, Paramount మరియు Warner Bros, Discovery లలో కంటెంట్ ను ఈ ప్రీమియం ప్లాన్ లతో ఆస్వాదించవచ్చు.

IPL చూడాలంటే ప్రీమియం ప్లాన్ తీసుకోవాలా?

జియో సినిమా కొత్త ప్రీమియం ప్లాన్ ప్రకటించ గానే IPL ప్రియులకు ముందుగా వచ్చే మొదటి ప్రశ్న, IPL చూడాలంటే ప్రీమియం ప్లాన్ తీసుకోవాలా? అని. దీని గురించి కూడా జియో క్లియర్ గా వివరాలను అందించింది. IPL మ్యాచ్ లను ఉచితంగానే అందరూ చూడవచ్చని మరియు ఇది Ad-Supported తో వస్తుందని తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :