రిలియన్స్ జియో ఇప్పుడు మరింత దూకుడుగా వుంది. జియో OTT ప్లాట్ఫామ్ ఆరంభమే అట్టహాసంగా మరియు ప్రతీ ఒక్కరికి చేరువయ్యేల చేసింది. JioCinema తో IPL ను అనుసంధానం చేయడం ద్వారా జియో దీని సక్సెస్ కి బాట వేసిందని చెప్పాలి. అయితే, జియో సినిమా యాప్ ను మరింత పటిష్టం చేసేందుకు సన్నద్ధం అయ్యింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ దీని నిదర్శనం అని చెప్పొచ్చు.
JioCinema యాప్ కోసం రిలయన్స్ ఇప్పుడు ఇండియా నుండి వెనుతిరిగిన HBO తో ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. దీనితో, HBO యొక్క ఫెమస్ మరియు మోస్ట్ వాచ్డ్ సిరీస్ అయిన Game Of Thrones, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి వంటి సిరీస్ లతో పాటుగా లేటెస్ట్ Last of US వంటి మరిన్ని సిరీస్ లు తిరిగి ఇండియాలో ప్రసారం అవుతాయి.
వాస్తవానికి, ముందుగా Disney+ Hotstar నుండి ప్రసారమైన ఈ HBO షో లను నిలిపివేయగా, ఇప్పడు ఈ షోలను తిరిగి ప్రసారం చెయ్యడానికి రిలయన్స్ యొక్క viacom 18, HBO మరియు వార్నర్ బ్రదర్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, IPL మ్యాచ్ లను ఉచితంగా 4 సీజన్స్ వరకూ చూడవచ్చని తెలిపి అందరి మనసును దోచుకున్న రిలయన్స్ ఇప్పుడు ఈ కొత్త వార్తతో మరొకసారి వార్తల్లో నిలిచింది.
ఇక మొత్తంగా చూస్తుంటే, రిలయన్స్ తన JioCinema యాప్ ను ప్రైమ్ వీడియో మరియు నెట్ ఫ్లిక్స్ వంటి ప్రముఖ OTT యాప్స్ కి ధీటుగా నిలబెట్టేలా కనిపిస్తోంది. ఈ యాప్ యొక్క ప్రీమియం సబ్ స్క్రిప్షన్ రేట్ ల గురించి కూడా ఆన్లైన్ లో చర్చ జరుగుతోంది. JioCinema యాప్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కోసం క్వార్టర్లీ మరియు వన్ ఇయర్ ప్లాన్స్ ను కూడా త్వరలోనే రిలయన్స్ ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటి వరకూ రిలయన్స్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.