జియోసినిమా ఇప్పుడు మరొక రికార్డ్ సొంతం చేసుకుంది. OTT ప్లాట్ఫామ్ లోకి అడుగుపెడుతూనే IPL 2023 తో భారీ స్పందన అందుకున్న జియో సినిమా జెట్ స్పీడ్ తో దూసుకు పోతోంది. గతంలో జియోసినిమా తన యాప్ పైన రికార్డ్ చేసిన 2.4 కోట్ల వీక్షకుల రికార్డ్ ను బద్దలు కొట్టి 2.5 కోట్ల వీక్షకులతో కొత్త రికార్డ్ ను నెలకొల్పింది. నిన్న జరిగిన IPL మ్యాచ్ సమయంలో ఈ కొత్త రికార్డ్ నమోదయ్యింది.
వాస్తవానికి, ఇది జియో సినిమా తన సొంత రికార్డ్ లను మాత్రమే కాదు ప్రపంచ రికార్డ్ లను సైతం బద్దలు కొట్టి కొత్త రికార్డ్ లను తిరగ రాస్తోంది. IPL సమయంలో ఒకొక్క మ్యాచ్ యొక్క యావరేజ్ వ్యూ టైమ్ 60 నిముషాలను దాటిందని మరియు ఇది యూజర్ యావరేజ్ వ్యూవింగ్ టైమ్ పరంగా వరల్డ్ రికార్డ్, అని జియో ఇటీవల వెల్లడించింది.
ఇక కొత్త రికార్డ్ వివరాల్లోకి వెళితే, నిన్న గుజరాత్ టైటాన్స్ (GT) మరియు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ సయమంలో జియో సినిమా 2.5 Cr వీక్షకులను దాటి ఈ కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
IPL 2023 ని ఉచితంగా అఫర్ చేస్తున్న జియో సినిమా భారీగా యూజర్లను సంపాదించుకుంది. జియో సినిమా 100M+ డౌన్ లోడ్స్ సాధించింది మరియు 1.32M రివ్యూలను కూడా యూజర్ల నుండి అందుకుంది.
ఇటీవలే, రిలయన్స్ ఈ జియో సినిమా యొక్క Premium ప్లాన్ ను కూడా ప్రకటించింది. జియో సినిమా ప్రీమియం ప్లాన్ ను రూ. 999 ధరతో అందించింది. ఈ ప్లాన్ తో ప్రీమియం కంటెంట్ కు యాక్సెస్ లభిస్తుంది మరియు ఒకేసారి 4 డివైజెస్ లో జియో సినిమా ను ఉపయోగించవచ్చు.