జియో సునామి అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే జియోఫోన్ ఉచితం
రిలయన్స్ జియో బంపర్ ఆఫర్
రీఛార్జ్ ఒకేసారి చేస్తే జియో 4G ఫోన్ ఉచితంగా లభిస్తుంది
కొత్త 4G ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది వారికి శుభవార్త
కొత్త జియోఫోన్ కోనాలనుకునే వారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, రెండు సంవత్సరాల రీఛార్జ్ ఒకేసారి చేస్తే జియో 4G ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే జియోఫోన్ ను వాడుతున్న కస్టమర్ల కోసం కూడా మంచి ప్లాన్ ని అందించింది.ఈ అఫర్ విశేషాలు ఏమిటో చూద్దాం.
రిలయన్స్ జియో మంచి లాభాలను తీసుకొచ్చే జియోఫోన్ 2021 ఆఫర్ ను రెండు సంవత్సరాల టోటల్ అన్లిమిటెడ్ సర్వీస్ మరియు ఉచిత జియోఫోన్ తో ప్రకటించింది. కొత్త 4G ఫీచర్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది వారికి శుభవార్త. ఇప్పటికీ 2G వాడుతున్న వినియోగదారులకు 4G సర్వీస్ ను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ అఫర్ విడుదల చేసినట్లు జియో పేర్కొంది.
జియోఫోన్ 2021 ఆఫర్
అతిపెద్ద టెలికాం ఆపరేటర్ జియో తన జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.
పైన తెలిపిన ఈ ప్రయోజనాలలతో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ప్రయోజనాలను కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి.
అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు నెలకు 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.