జియో రూ. 399 రీఛార్జ్ మీద రూ 99 క్యాష్ బ్యాక్.

Updated on 13-Nov-2017

జియో  తనప్రీపెయిడ్  వినియోగదారులకు ఒక కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ తెస్తుంది. ఈ ఆఫర్ కింద, అమెజాన్ పే ద్వారా జియో యొక్క 399 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జి  పై 99 రూ. కాష్ బ్యాక్  పొందవచ్చు . ఈ క్యాష్ బ్యాక్ మీ అమెజాన్ పే అకౌంట్ కు క్రెడిట్ చేయబడుతుంది. క్యాష్ బ్యాక్ 7 రోజుల్లోపు లభిస్తుంది . ఈ ఆఫర్ నవంబరు 6 నుండి మొదలై నవంబరు 14 వరకు వాలిడ్ అవుతుంది , అంటే నవంబర్ 14 వరకు ఈ ఆఫర్ ని  మీరు పొందవచ్చు.జియో  యొక్క ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ అమెజాన్ పే ద్వారా ఫస్ట్ రీఛార్జ్లో అందుబాటులో ఉంటుంది. మీరు ఈ ఆఫర్ కోసం అర్హత పొందకపోతే, మీరు 100 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జింగ్ ద్వారా 50 రూపాయల క్యాష్బ్యాక్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా మొదటి రీఛార్జిలో కూడా వాలిడ్ అవుతుంది .  మీరు నవంబర్ 15 వరకు ఈ ఆఫర్ ని  పొందవచ్చు.

మీరు అమెజాన్ పే ద్వారా ఒకసారి లేదా రెండుసార్లు రీఛార్జి చేసినట్లయితే, మీరు 20% రిపీట్  రిఛార్జ్ ఆఫర్ ని  పొందవచ్చు. ఈ ఆఫర్ కింద, మీరు అమెజాన్ పే బాలన్స్ నుండి రీఛార్జి  చేస్తే  రూ .20 వరకు క్యాష్ బ్యాక్ అందుకుంటారు. అక్టోబర్ 9 నుంచి  నవంబర్ 30 వరకు ఈ ఆఫర్స్ నడుస్తాయి .ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందటానికి,  అమెజాన్ డాట్ ఇన్ ఆఫర్ పేజీని సందర్శించండి. మీ ప్రీపెయిడ్ జియో మొబైల్ నెంబర్ పై 399 లేదా అంత కన్నా ఎక్కువ  రీఛార్జ్  అమెజాన్ పే బ్యాలెన్స్  తో చేయండి 

 

 

 

 

 

Connect On :