జియో తనప్రీపెయిడ్ వినియోగదారులకు ఒక కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ తెస్తుంది. ఈ ఆఫర్ కింద, అమెజాన్ పే ద్వారా జియో యొక్క 399 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జి పై 99 రూ. కాష్ బ్యాక్ పొందవచ్చు . ఈ క్యాష్ బ్యాక్ మీ అమెజాన్ పే అకౌంట్ కు క్రెడిట్ చేయబడుతుంది. క్యాష్ బ్యాక్ 7 రోజుల్లోపు లభిస్తుంది . ఈ ఆఫర్ నవంబరు 6 నుండి మొదలై నవంబరు 14 వరకు వాలిడ్ అవుతుంది , అంటే నవంబర్ 14 వరకు ఈ ఆఫర్ ని మీరు పొందవచ్చు.జియో యొక్క ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమెజాన్ పే ద్వారా ఫస్ట్ రీఛార్జ్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు ఈ ఆఫర్ కోసం అర్హత పొందకపోతే, మీరు 100 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జింగ్ ద్వారా 50 రూపాయల క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా మొదటి రీఛార్జిలో కూడా వాలిడ్ అవుతుంది . మీరు నవంబర్ 15 వరకు ఈ ఆఫర్ ని పొందవచ్చు.
మీరు అమెజాన్ పే ద్వారా ఒకసారి లేదా రెండుసార్లు రీఛార్జి చేసినట్లయితే, మీరు 20% రిపీట్ రిఛార్జ్ ఆఫర్ ని పొందవచ్చు. ఈ ఆఫర్ కింద, మీరు అమెజాన్ పే బాలన్స్ నుండి రీఛార్జి చేస్తే రూ .20 వరకు క్యాష్ బ్యాక్ అందుకుంటారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 30 వరకు ఈ ఆఫర్స్ నడుస్తాయి .ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందటానికి, అమెజాన్ డాట్ ఇన్ ఆఫర్ పేజీని సందర్శించండి. మీ ప్రీపెయిడ్ జియో మొబైల్ నెంబర్ పై 399 లేదా అంత కన్నా ఎక్కువ రీఛార్జ్ అమెజాన్ పే బ్యాలెన్స్ తో చేయండి