Jio 5G Phone: ఈ నెలలో విడుదల అవుతోందా?

Updated on 09-Mar-2023
HIGHLIGHTS

Jio 5G Phone ఈ నెలలో విడుదల అవుతోందా?

JIO AGM లో Jio తన 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ కావచ్చని అంచనా

Jio 5G Phone ఎలా ఉంటుందో అని కూడా చెబుతున్నారు

Jio 5G Phone ఈ నెలలో విడుదల అవుతోందా? అని అడిగితే అవుననే చెబుతున్నాయి ప్రస్తుతం వస్తున్న నివేదికలు. ఇందుకు బలమైన కారణాలను మరియు అంచనాలను కూడా కొన్ని నివేదికను వెల్లడించాయి. ఈ నెల చివరిలో జరిగే AGM (వార్షిక సాధారణ సమావేశం)లో Jio తన 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక వేళ మనం ఈ నివేదికలను విశ్వసిస్తే, అప్ కమింగ్ Jio 5G Phone ఎటువంటి వివరాలను కలిగి ఉంటుంది మరియు ఇంకా ఎటువంటి ప్రకటనలను చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం.

గత సంవత్సరం జరిగిన reliance AGM నుండే జియో 5G ఫోన్ ప్రకటింస్తుదని అందరూ అంచనా వేయగా, జియో మాత్రం JioPhone Next 4G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. అయితే, ఈ సంవత్సరం కంపెనీ 5G నెట్ వర్క్ తో పాటుగా Jio 5G Phone ను కూడా లాంచ్ చేస్తుందని చెబుతున్నారు. అంటే, ఈ నెల చివరిలో జరగనున్న రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ నుండి Jio 5G ఫోన్‌లతో పాటు కొన్ని ఎంపిక చేసిన నగరాలు లేదా ప్రాంతాలలో తన సూపర్‌ఫాస్ట్ 5G సేవను కూడా జియో అందించవచ్చు. అయితే, ఇవన్నీ కూడా అంచనా వేసి చెబుతున్న విషయాలు మాత్రమే. జియో ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని గమనించండి.

Jio 5G Phone: అంచనా స్పెక్స్

కొన్ని నివేదికల ప్రకారం, Jio 5G ఫోన్ 6.5-అంగుళాల డిస్ప్లేని సాధారణ HD రిజల్యూషన్ ప్యానెల్ తో కలిగిఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, అప్ కమింగ్  Jio 5G ఫోన్ 4GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ పాటు, Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌ తో రావచ్చని ఊహిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనీసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అమర్చవచ్చు.

అలాగే, Jio 5G ఫోన్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో పాటుగా 13MP మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉండవచ్చు. అయితే, ఇవన్నీ కూడా ముందస్తు అంచనా స్పెక్స్ మాత్రమే. జియో అధికారికంగా జియో 5G ఫోన్ ను వెల్లడించినప్పుడు చూడాలి ఫోన్ యుగాల ఉంటుందో.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :