పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) తన 45 వ ఫ్లైట్ అయినటువంటి PSLV-C 43 ని భారతదేశం యొక్క సొంత సాటిలైట్ HysiS మరియు 8 దేశాలకు చెందిన మరో 30 శాటిలైట్లతో, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) లో ఉన్నటువంటి మొదటి లాంచ్ ప్యాడ్ (FLP) నుండి విజయవంతంగా ప్రయోగించింది.
ఈ HysiS అనేది భూమి పరిశీలన కోసం ISRO చేత అభివృద్ధిచేయబడిన శాటిలైట్. ఈ PSLV-C 43 యొక్క ప్రధాన మిషన్ కూడా ఇదే. దీని భూమికి 636 కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ భూమిని పరిశీలించేలా నిర్ధేశించబడింది.
ఈ భారతీయ సాటిలైట్ తో పాటుగా, 8 దేశాలకు చెందిన 1 మైక్రో మరియు 29 నానో శాటిలైట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మిగిలిన ఇతర 30 శాటిలైట్ల యొక్క మొత్తం బరువు 261.5 కిలోలు మరియు ఇవన్నీ కూడా భూమికి 504 కిలోమీటర్ల దూరంలో ఉండేలా నిర్ధేశించబడినవి. ఇందులో అత్యధికంగా, USA కి చెందిన 23 శాటిలైట్లు వున్నాయి. శాటిలైట్లను ప్రయోగించడంలో భారతదేశం ఘనకీర్తిని కలిగివుంది.