రూ. 2000 నోట్ల ఉపసంహరణ పై క్లారిటీ ఇచ్చిన RBI గవర్నర్..PAN కార్డ్ తప్పని సరి పైన కూడా క్లారిటీ వచ్చింది.!
2వేల నోట్ల ఉపసంహరణ పై RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు
క్లిన్ నోట్ పాలసీలో లో భాగంగా ఇటువంటి నిర్ణయాలను RBI తీసుకుంటుందని కూడా చెప్పారు
రూ. 2,000 రూపాయల నోట్లను తిరిగి వెనక్కు తీసుకోవడానికి చేసిన దిశా నిర్ధేశాలు
రూ. 2,000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తునట్లు RBI ప్రకటించిన తరువాత ఇప్పుడు మొదటిసారిగా ఈ విషయం పైన RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రూ. 500 మరియు రూ. 1,000 రూపాయల పాత నోట్ల రద్దు సమయంలో ఏర్పడిన అనిశ్చితిని తగ్గుంచేందుకు రూ. 2,000 రూపాయల నోట్ల వాడుకలోకి తీసుకు రావడం జరిగింది. అయితే, ఇది మార్కెట్ లో ఏర్పడిన కొరత స్థిమిత పడిన వెంటనే రూ. 2,000 నోట్ల జారీని కూడా నిలిపివేసినట్లు, గుర్తుకు చేశారు. అయితే, ఇప్పుడు ఈ నోట్లను ఉపసంహరించినా ఇది మార్కెట్ పైన అంత ప్రభావం పడిదని గుర్తించడం ద్వారా ఈ నోట్లను తిరిగి వెన్నకు తీసుకుంటునట్లు తెలిపారు.
రూ. 2,000 రూపాయల నోట్లను తిరిగి వెనక్కు తీసుకోవడానికి చేసిన దిశా నిర్ధేశాలను కూడా దాస్ గుర్తు చేశారు. ఈ నోట్లను తిరిగి వెనక్కు తీసుకోవడానికి తగిన సమయాన్ని ఇవ్వడం ద్వారా ఈ నోటు మార్పిడికి ఎటువంటి ఆటంకం ఉండదని, క్లిన్ నోట్ పాలసీలో లో భాగంగా ఇటువంటి నిర్ణయాలను RBI తీసుకుంటుందని కూడా చెప్పారు.
అయితే, మరొక విషయం పైన కూడా దాస్ క్లారిటీ ఇచ్చారు. 2,000 నోట్లను ఒకరోజులో చాలా మార్చుకునే అవకాశం ఉందని, దీనికోసం ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది ప్రజలకు మనస్సులో మెదిలాడే ప్రధాన ప్రశ్న డిపాజిట్ సమయంలో PAN Number ను తప్పని సరిగా ఇవ్వాలా లేక అవసరం లేదా? అని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. దీని పైన కూడా క్లారిటీ ఇప్పుడు వచ్చింది.
వాస్తవానికి, రూ. 50,000 మరియు అంత కంటే ఎక్కువ అమౌంట్ ను డిపాజిట్ చేస్తే పాన్ నెంబర్ ను ఇవ్వడం తప్పని సరి. ఇది చాలా కాలంగా వాడుకలో వున్నా పద్దతే మరియు ఇప్పుడు కూడా అదే విధంగా 50 వేల రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ అమౌంట్ కు రూ. 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసే వారికి ముందు నుండి ఉన్న విధంగానే పాన్ నెంబర్ ను సబ్ మీట్ చేయాల్సి ఉంటుంది.