ఇండియాలో BGMI బ్యాన్ అయ్యిందా.!

ఇండియాలో BGMI బ్యాన్ అయ్యిందా.!
HIGHLIGHTS

BGMI (బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా) బ్యాన్ అయ్యింది

గూగుల్ స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుండి డిలీట్ చెయ్యబడింది

భారత ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ విద్ధంగా జరిగినట్లు తెలుస్తోంది

BGMI (బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా) బ్యాన్ అయ్యిందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఎందుకంటే, నిన్న సాయంత్రం గూగుల్ స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుండి అకస్మాత్తుగా డిలీట్ చెయ్యబడింది. నిజానికి, ఈ సంఘటన గురించి ముందుగా ఎటువంటి సమాచారం లేకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, భారత ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ విద్ధంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక సమాచారం ఏది రాలేదు.

Krafton యొక్క PlayerUnknown's Battlegrounds (PUBG) గేమింగ్ యాప్ ఇండియాలో బ్యాన్ అయ్యిన తరువాత 'బ్యాటిల్‌ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)' అనే కొత్త అవతార్‌లో దాన్ని తిరిగి తీసుకువచ్చింది. అయితే, ఈ గేమ్ ఇండియాలో వచ్చి కేవలం ఒక సంవత్సరం మాత్రమే దాటింది. ఈ నెల ప్రారంభంలో, ఈ గేమ్ దాని మొదటి వార్షికోత్సవాన్ని ప్రత్యేక లాగిన్ ఈవెంట్‌తో కూడా జరుపుకుంది. అయితే, ఆశ్చర్యకరంగా కొన్ని వారాల్లోనే Google Play Store మరియు Apple App Store నుండి గేమ్ డిలీట్ చేయబడటం గేమర్స్ కు చేదు వార్తే అవుతుంది.

bgmi2.jpg

అయితే, ఇప్పటికే BGMI (బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా) గేమ్ డౌన్ లోడ్ చేసుకున్న వారు ఎటువంటి ఆటంకం లేకుండా ఆడుకోవచ్చు. అయితే, కొత్తగా డౌన్ లోడ్ చేసుకోదలిచిన వారికి మాత్రం ఈ గేమ్ అందుబాటులో ఉండదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo