IRCTC ఇప్పుడు ట్రెయిన్ బయలుదేరే 30 నిమిషాల ముందు కూడా రిజర్వేషన్లు ఇస్తుంది.

Updated on 13-Nov-2015
HIGHLIGHTS

ఇంతవరకూ చార్ట్ ప్రిపేర్ అయితే టికెట్స్ ఉండేవి కాదు

IRCTC కొత్త రూల్స్ తో రైల్వే ప్రయాణికులకు సులభమైన అవకాశాలు ఇస్తుంది. ఇక నుండి ట్రెయిన్ బయలదేరే 30 నిముషాలు ముందు కూడా బెర్త్ లను రిజర్వ్ చేసుకోవచ్చు.

ఇది నవంబర్ 12 నుండి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ట్రెయిన్ departure కు నాలుగు గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యేది. ఇప్పడు చార్ట్ ప్రిపరేషన్ రెండు సార్లు చేయనుంది రైల్వే. 

ఒకటి నాలుగు గంటల ముందు, మరొకటి 30 నిమిషాలకు ముందు జరుగుతాయి. సో మీరు ఇంటర్నెట్ లో అయినా, ప్లాట్ ఫార్మ్ వద్ద అయినా స్టేషన్ కు వెళ్లి కూడా రిజర్వేషన్ పొందగలరు. 

ఇప్పటివరకూ చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత(అంటే ట్రెయిన్ బయలదేరే ముందు) రిజర్వేషన్ జరిగేది కాదు. కేవలం జెనెరల్ బుకింగ్ ఉండేవి. అలాగే చార్ట్ ప్రిపేర్ అయినా సరే ట్రెయిన్ స్టార్ట్ అవుతున్న స్టేషన్ లోనే రిజర్వేషన్  చేసుకునే అవకాశం ఉండేది అప్పటికప్పుడు. 

ఇక ప్రయాణాల కోసం నెలలకు నెలలు ముందు రిజర్వేషన్ చేయనవసరం లేదు. కాని అప్పటికప్పుడు బెర్త్ లు కాలిగా ఉంటేనే ఇది సౌలభ్యం అవుతుంది. ఒకటో రెండో బెర్త్ కాలిగా ఉండే చాన్సేస్ ఎక్కువ. సో సింగిల్ జర్నీ చేసేవారికి ఇది మంచి ఆప్షన్.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :