IRCTC Down : భారతీయ రైల్వే ట్రైన్ టికెట్ బుక్ సర్వీస్ IRCTC సర్వర్ డౌన్ కావడం తో ప్రయాణికుల ఇక్కట్లు పడ్డారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సర్వర్ విఫలం కావడంతో ఈ సర్వీస్ పూర్తిగా డౌన్ అయ్యింది మరియు దీని కారణంగా టికెట్ బుకింగ్ తో పాటు మరిన్ని సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ సమస్యతో IRCTC ద్వారా టికెట్స్ బుకింగ్ కూడా చేయలేక పోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.
రియల్ టైం ఔటేజ్ ఇన్ఫర్మేషన్ అందించే Downdetector ఈ విషయాన్ని వెల్లడించింది. IRCTC డౌన్ అయినట్లు అధిక సంఖ్యలో కంప్లైంట్ అందుకున్న ఈ సైట్ ఈ విషయాన్ని తెలిపింది. ఈ సమస్య ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యింది మరియు 2500 లకు పైగా కంప్లైంట్ అందుకుంది.
ఈ సమస్యను 56 శాతం యూజర్లు వెబ్సైట్ పైన, 30 శాతం మంది App పైన మరియు మిగిలిన 14 శాతం మంది యూజర్లు టికెటింగ్ పై చూసినట్లు కంప్లైంట్ చేశారు. వాస్తవానికి, ఇలా జరగడం IRCTC కి కొత్తేమి కాదనుకోండి, ఇప్పటికే చాలా సార్లు ఇలా జరిగింది.
ఇక అసలు విషయం ఏమిటి అని చూస్తే, వెబ్సైట్ మైంటెనెన్సు కారణంగా e-ticket సర్వీస్ అందుబాటులో ఉండదు అని ఇండియన్ రైల్వే సమాధానం ఇచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్ లేదా TDR ఫైల్ చేయడానికి 14646,08044647999 & 08035734999 లేదా etickets@irctc.co.in కి మెయిల్ చేయండి అని IRCTC సైట్ ద్వారా విన్నవించింది.
Also Read: Realme 14 Pro Series 5G సూపర్ స్లిమ్ మరియు సూపర్ ఫీచర్స్ తో లాంచ్ వస్తోంది.!
ఇంకేముంది, IRCTC డౌన్ అయిన విషయాన్ని సోషల్ మీడియాలో తమదైన స్టైల్ లో రకరకాలుగా మీమ్స్ మరియు ఫన్నీ వీడియోస్ తో ప్రజలు ఇండియన్ రైల్వే గురించి రకరకాల ట్రోల్స్ చేశారు. అయితే, ప్రస్తుతం IRCTC బాగానే పని చేస్తోంది.