IRCTC హాక్ అయ్యింది అన్న వార్తల పై డిజిట్ కు IRCTC reply ఇచ్చింది
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ tourism కార్పోరేషన్ (IRCTC) వెబ్ సైట్ హాక్ అయ్యింది అంటూ రిపోర్ట్స్ వచ్చాయి.
రూమర్స్ ఎక్కువ అవటంతో పోలిస్ మరియు సైట్ అఫీషియల్ సిబ్బంది, ఇప్పుడు ఈ issue పై దృష్టి పెట్టినట్లు సమాచారం.
అయితే IRCTC ఇవన్నీ రూమర్స్ మాత్రమే, నిజాలు కాదు అని వెల్లడించింది. కేస్ మహారాష్ట్ర పోలిస్ సైబర్ సెల్ కు వెళ్ళటంతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.
మేము ఆల్రెడీ సైబర్ సెల్ ను ఆశ్రయించటం జరిగింది, వారి కామెంట్స్ కొరకు వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు IRCTC ట్విటర్ లో "IRCTC వెబ్ సైట్ పై ఎటువంటి హాకింగ్ జరగలేదు" అని డిజిట్ టీం కు తెలిపింది. క్రింద tweet చూడగలరు.
అసలు IRCTC లో హాక్ అవటానికి ఏముంది? అనే ప్రశ్న కొంతమందికి కామాన్ గా వస్తుంటుంది… పాన్ కార్డ్ డిటేల్స్, బ్యాంకు డిటేల్స్ వంటివి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అకౌంట్స్ లో.. పైగా ఇండియాలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ కలిగిన సైట్ కూడా ఇదే అని చెప్పవచ్చు.
@digitindia IRCTC website has not been hacked. Enquiry is being conducted regarding alleged data sale.
— IRCTC Ltd. (@IRCTC_Ltd) May 5, 2016