Instagram Down: తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్న యూజర్లు.!
ఫోటో షేరింగ్ అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ డౌన్ అయ్యింది
ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్నామని వేలకొద్దీ యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు
ఇన్స్టాగ్రామ్ ఈరోజు డౌన్ అయినట్లు యూజర్ లు కంప్లైంట్ చేస్తున్నారు
Instagram Down: మెటా యొక్క ఫోటో షేరింగ్ అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ డౌన్ అయ్యింది. ఈ యాప్ లో తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్నామని వేలకొద్దీ యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలకొద్ది యూజర్లు చవి చూసినట్లు కూడా చెబుతున్నారు. ఎక్కువ శాతం మంది యూజర్లకు ఇదే సమస్య ఎదురైనట్లు వెల్లడిస్తున్నారు.
Instagram Down
ఇన్స్టాగ్రామ్ ఈరోజు డౌన్ అయినట్లు యూజర్ లు కంప్లైంట్ చేస్తున్నారు. రియల్ టైమ్ ఔటేజ్ డెటెక్టింగ్ ప్లాట్ ఫామ్ డౌన్ డిక్టేటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి యూజర్ల నుంచి అందుకున్న కంప్లైంట్ ద్వారా ఇంస్టాగ్రామ్ డౌన్ అయినా విషయం బయటకు వచ్చింది.
ఇది మాత్రమే కాదు, X (ఒకప్పటి ట్విట్టర్) నుంచి కూడా అనేకమంది యూజర్లు తమ అకౌంట్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంస్టాగ్రామ్ డౌన్ అయ్యిందంటూ, ఫీడ్ రిఫ్రెష్ అవ్వడం లేదంటూ యూజర్లు మీమ్స్ కూడా షేర్ చేశారు. ఇటీవల కూడా ఇన్స్టాగ్రామ్ డౌన్ అయ్యింది. ఈ ఫోటో షేరింగ్ యాప్ ఇటీవల కాలంలో చాలా సమస్యలు చూస్తోంది.
డౌన్ డిక్టేటర్ ప్లాట్ ఫామ్ ద్వారా దాదాపు 77 శాతం మంది యూజర్లు ఫీడ్ రిఫ్రెష్ అవ్వడం లేదు, అని తెలిపారు. అలాగే, 22 శాతం మంది లాగిన్ ఇష్యు మరియు 11 శాతం మంది కంటెంట్ అప్లోడింగ్ ఇష్యు లను చూసినట్లు కంప్లైంట్ చేశారు.
Also Read: Winter Specials Sale: భారీ డిస్కౌంట్ తో 21 వేలకే Xiaomi పెద్ద 4K Smart Tv అందుకోండి.!
ఇన్స్టాగ్రామ్ లో యూజర్లు చూసిన సమస్యకు ఏదైనా టెక్నికల్ గ్లిచ్ కారణం అయ్యి ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అందుకే, యూజర్లు తమ అకౌంట్ లలో ఇటివంటి సమస్యలు చూసి ఉంటారు, అని కూడా చెబుతున్నారు.