InFocus కొత్తగా పోర్టబుల్ డెస్క్ టాప్ కంప్యుటర్ లాంచ్ చేసింది. దీని పేరు, kangaroo. జస్ట్ స్మార్ట్ ఫోన్ సైజ్ లో ఉంటుంది డివైజ్. ప్రస్తుతం US లో అందుబాటులో దీని ధర 6,400 రూ.
దీనిలో సెక్యురిటీ అండ్ ప్రైవెసి కొరకు విండోస్ హలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు HDMI పోర్ట్, usb 2.0 అండ్ usb 3.0 పోర్ట్ , DC పవర్ పోర్ట్ ఉన్నాయి.
స్పెసిఫికేషన్స్- క్వాడ్ కోర్ ఇంటెల్ cherrytrail ఆటం x5-Z8500 2.24GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb అదనపు SD కార్డ్ స్టోరేజ్ సపోర్ట్. usb స్టిక్ లో హై ఎండ్ గేమ్స్ వంటివి రన్ అవటం కష్టం.
టీవీ కు కనెక్ట్ చేయటానికి ఒక కేబుల్ అండ్ పవర్ supply కొరకు మరొక కేబుల్ ఉన్నాయి. దీనిలో బ్యాటరీ కూడా ఉంది. నార్మల్ యూసేజ్ లో 4 గంటలు వస్తుంది బ్యాక్ అప్.
విండోస్ 10 మీద రన్ అయ్యే ఈ పోర్టబుల్ pc డివైజ్ ను మానిటర్ కు కనెక్ట్ చేసి వాడుకోవటమే. బ్లూటూత్ 4.0 కూడా ఉంది. గతంలో Iball కూడా 8,999 రూ లకు iBall splendo పేరుతో విండోస్ 8.1 మీద రన్ అయ్యే usb pc స్టిక్ లాంచ్ చేసింది.