10 వేల ధరలో 8GB ర్యామ్, 50MP కెమెరాతో ఫోన్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్.!

10 వేల ధరలో 8GB ర్యామ్, 50MP కెమెరాతో ఫోన్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్.!
HIGHLIGHTS

Infinix ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Infinix Hot 12 Pro ను లాంచ్ చేసింది

10 వేల సబ్ కేటగిరిలో 8GB హెవీ ర్యామ్ తో వచ్చింది

8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది

నిన్న Infinix ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Infinix Hot 12 Pro ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేల సబ్ కేటగిరిలో 8GB హెవీ ర్యామ్ మరియు జతగా 5GB వర్చువల్ ర్యామ్ తో విడుదల చేసింది. బడ్జెట్ ధరలో హెవీ ర్యామ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసినట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. కేవలం ర్యామ్ మాత్రమే కాదు 50MP రియర్ కెమెరా సెటప్, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా. 

Infinix Hot 12 Pro: ధర మరియు సేల్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ భారీ 8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ వేరియంట్ లలో ప్రకటించింది. వీటిలో (8GB + 64GB) వేరియంట్ ధర కేవలం రూ.10,999 కాగా (8GB + 128GB) వేరియంట్ ధర రూ.11,999 రూప్యాలు మాత్రమే. ఈ ఫోన్ ఆగష్టు 8 వ తేదీ నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ను ICICI మరియు Kotak కార్డ్స్ లేదా EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ అఫర్ తో బేసిక్ వేరియంట్ ను  కేవలం రూ.9,999 రూపాయలకె పొందవచ్చు.

Infinix Hot 12 Pro: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T616 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జతచేసింది.

కెమెరా విషయానికి వస్తే, హాట్ 12 ప్రో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే, పంచ్ హోల్ కటౌట్ లో 8ఎంపి సెల్ఫీని కూడా అందించింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo