Super APP: ప్రయాణికుల కోసం కొత్త యాప్ లాంచ్ చేయనున్న ఇండియన్ రైల్వేస్.!
ఇండియన్ రైల్వే కొత్త Super APP ను పరిచయం చేయబోతోంది
ఈ యాప్ అన్ని సౌకర్యాలను ఒక దగ్గరే అందిస్తుంది
కేవలం సింగిల్ యాప్ తో అన్ని అప్డేట్స్ అందుకోవచ్చు
Super APP: ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలను ఒకే దగ్గర అందించే కొత్త అప్లికేషన్ ను ఇండియన్ రైల్వే పరిచయం చేయబోతోంది. ‘సూపర్ యాప్’ పేరుతో ఈ కొత్త యాప్ ను పరిచయం చేయబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విడివిడిగా ఇండియన్ రైల్వేస్ ఆఫర్ చేస్తున్న అనేక సర్వీసులను ఈ యాప్ ఒక్క దగ్గరికి చేరుస్తుంది. ఈ సూపర్ యాప్ ను 2024 ఫైనాన్షియల్ ఇయర్ చివరి నాటికి అందించవచ్చని చెబుతున్నారు.
Super APP
ప్రస్తుతం, రైలు ప్రయాణికులు వారి వివరాలు చెక్ చేసుకోవడానికి, టికెట్ బుక్ చేసుకోవడానికి మరియు ఫుడ్ సర్వీస్ కోసం అనేక రకాల యాప్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సర్వీసులను ఒక దగ్గర అందించే సూపర్ యాప్ ను ఇండియన్ రైల్వేస్ తీసుకువస్తుందట. IRCTC Rail Connect, Rail Madad, UTS, ఫుడ్ ఆన్ ట్రాక్ మరియు నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టం (NTES) వంటి అన్ని యాప్స్ ని ఈ సూపర్ యాప్ ఇంటిగ్రేట్ చేస్తుంది.
సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం (CRIS) మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రెండిటిని సహకారంతో ఈ సూపర్ నిర్మాణం మరియు నిర్వహణ సాధ్యమవుతుందని చెబుతున్నారు.
ఈ సూపర్ యాప్ టికెట్ బుకింగ్ (రిజర్వుడ్ /అన్ రిజర్వుడ్), లైవ్ ట్రైన్ స్టేటస్ అప్డేట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ మరియు ఆన్ బోర్డ్ క్లీనింగ్ రిక్వెస్ట్ వంటి ఫీచర్స్ తో పాటు కావాల్సిన స్టేషన్ కు ఫుడ్ బుకింగ్ చేసుకోవడం వంటి మరిన్ని సర్వీస్ లకు యాక్సెస్ అందిస్తుందని ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపినట్లు చెబుతున్నారు.
Also Read: Redmi 14C 5G: గ్లోబల్ డెబ్యూట్ ఇండియా నుంచి కన్ఫర్మ్ చేసిన షియోమీ.!
ఈ అప్ కమింగ్ ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS రెండు ఆపరేటింగ్ సిస్టం లలో వస్తుందని మరియు ఇది త్వరలోనే కార్య రూపం దాలుస్తుంది, అని కూడా చెబుతున్నారు. ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే, రైల్వే సర్వీస్ మరియు అప్డేట్స్ కోసం అనేక యాప్స్ ఫోన్ లో నింపాల్సిన అవసరం ఉండదు, కేవలం సింగిల్ యాప్ తో అన్ని అప్డేట్స్ అందుకోవచ్చు.