ఇండియన్ గవర్నమెంట్ Panic( అత్యవసర ) Alert ఫెసిలిటీ ను ప్రారంభించనుంది. మార్చ్ 2016 లో వస్తుంది.
ఏంటి ఇది?
మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బంది లేదా ప్రమాదకరమైన సందర్భాలను ఫేస్ చేస్తే అలెర్ట్ చేస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
స్మార్ట్ ఫోన్ పై ఉన్న నంబర్ 9 ను లాంగ్ ప్రెస్ చేస్తే govt అథారిటీస్ మరియు మీ దగ్గరి వాళ్ళకు GPS లొకేషన్ ట్రాకింగ్ సహాయంతో అలెర్ట్ చేస్తుంది.
ఇది దేశంలోని women మరియు పిల్లల సేఫ్టీ ను ఉద్దేశించి ముందుకు వస్తున్న ప్రాజెక్ట్. ఫ్యూచర్ హాండ్ సెట్స్ లో 9 నంబర్ లాంగ్ ప్రెస్ కాకుండా వాల్యూమ్ బటన్స్ రెండింటినీ ఒకేసారి ప్రెస్ చేస్తే అలెర్ట్ చేస్తుంది.
ఇది women అండ్ child డెవెలప్మెంట్ మినిస్టర్, మేనకా గాంధీ చే initiatie చేయబడిన ప్రాజెక్ట్. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉంది. రూరల్ ఏరియాలలో స్మార్ట్ ఫోన్స్ ఉండవు కాబట్టి feature ఫోన్స్ లో కూడా ఇది పనిచేసేందుకు హాండ్ సెట్స్ తయారీ దారులతో మంతనాలు జరుపుతున్నారు ప్రాజెక్ట్ సిబ్బంది.
అదే కారణం తో దీనిని యాప్ రూపంలో కూడా తేవటం లేదు. అంత కన్నా సింపుల్ అండ్ బేసిక్ ఫీచర్ తో పనిచేసేలా చేయటానికి. అయితే ఇలాంటివే థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉన్నాయి.
సింగిల్ టచ్ తో లొకేషన్, అలెర్ట్ మెసేజ్ వంటివి ముందే రిజిస్టర్ చేసుకున్న కాంటాక్ట్స్ కు పంపుతాయి ఇవి. ఇలాంటి విషయానికి బెస్ట్ థర్డ్ పార్టీ యాప్ ఏంటో త్వరలో తెలియజేస్తాను.