లేటెస్ట్ గా 14 యాప్స్ బ్యాన్ చేసిన కేంద్రం..ఎందుకో తెలిస్తే వెంటనే డిలీట్ చేస్తారు.!

లేటెస్ట్ గా 14 యాప్స్ బ్యాన్ చేసిన కేంద్రం..ఎందుకో తెలిస్తే వెంటనే డిలీట్ చేస్తారు.!
HIGHLIGHTS

దేశ చట్టాలను తుంగలోకి తొక్కిన మరొక 14 యాప్స్ బ్యాన్

ఈ యాప్స్ ద్వారా ముష్కరులు చేస్తున్నట్లు సంప్రదింపుల ఆరోపణ

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సూచనా మేరకు బ్యాన్ చేసిన ప్రభుత్వం

దేశ చట్టాలను ఉల్లంఘిస్తున్న అనేక యాప్స్ ను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన విషయం మనకు ఇప్పటికే సుపరిచితమే. ఇప్పుడు ఇదే దారిలో దేశ చట్టాలను తుంగలోకి తొక్కిన మరొక 14 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ యాప్స్ దేశ రక్షణకు భంగం కలిగించే విదంగా ఉన్నట్లు, ఇంటెలిజెన్స్  అప్రమత్తం చేయడంతో ఈ చర్యలకు దిగినట్లు నివేదికలు తెలిపాయి. 

ANI news నివేదిక ప్రకారం, జమ్మూ మరియు కాశ్మీర్ లోని ముష్కరులు ఒక 14 యాప్స్ ద్వారా ఎక్కువగా సంప్రదింపులు జరుపుతున్నట్లు, ఇంటెలిజెన్స్ ఏజన్సీలు గుర్తించడం ద్వారా వాటి పైన అందించిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ యాప్స్ పైన చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. చాలా కాలంగా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs) చర్యల పైన నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఒక 14 యాప్స్ ద్వారా ముష్కరులు ఎక్కువగా ఒకరితో ఒకరు సంప్రదింపులు చేస్తున్నట్లు గుర్తించింది. 

 

 

ఈ యాప్స్ దేశ చట్టాలను ఉల్లంఘన చేస్తూ, దేశ రక్షణకు భంగం కలిగించేలా ఉన్నట్లు గుర్తించిన కేంద్రం, ఇన్ఫర్మేషన్ టెక్నలజీ ACT, 2000, సెక్షన్ 69A ప్రకారం, వీటిని బ్యాన్ చేసినల్టు ఈ నివేదిక పేర్కొంది. ఈ యాప్స్  పూర్తి వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ, కొన్ని యాప్స్ సంభావ్యతను బయటపెట్టింది. 

వీటిలో, Bచాట్, బ్రియార్, మీడియాఫైర్, నాండ్ బాక్స్, క్రిప్ వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, Wickrme, కానియన్, IMO, ఎలిమెంట్, సెకండ్ లైన్, జింగీ, వంటి మరిన్ని యాప్స్ ఉన్నట్లు ఈ నివేదిక లో సూచించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo