PM Modi చేతుల మీదుగా అట్టహాసంగా మొదలైన IMC 2023

PM Modi చేతుల మీదుగా అట్టహాసంగా మొదలైన IMC 2023
HIGHLIGHTS

PM Modi చేతుల మీదుగా IMC 2023 ఈరోజు ప్రారంభించబడింది.

ఆసియా యొక్క అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ IMC 2023

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 ను ఈరోజు లాంఛన ప్రాయంగా ప్రారంభించారు

దేశ ప్రధాని PM Modi చేతుల మీదుగా ఢిల్లీ లోని ప్రగతీ మైదాన్ వేదికగా IMC 2023 (India Mobile Congress 2023) ఈరోజు ప్రారంభించబడింది. ఆసియా యొక్క ఈ 7వ ప్రీమియర్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ అక్టోబర్ 27, 28 మరియు అక్టోబర్ 29 మూడు రోజులు నిర్వహించ బడుతుంది. ఈ అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ నుండి టెక్ దిగ్గజాలైన Reliance, Nokia, Airtel, AMD, మరియు మరిన్ని కంపెనీల త్వరలో తీసుకు రాబోతున్న కొత్త టెక్ లను ఈ టెక్నాలజీ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తాయి.

IMC 2023 inaugurated by PM Modi

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు

దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆసియా యొక్క అతిపెద్ద ప్రీమియర్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 ను ఈరోజు లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. ఈ అతిపెద్ద టెక్ ఎగ్జిబిషన్ నుండి కొత్త టెక్ ఇన్నోవేషన్స్ మరియు అప్ కమింగ్ టెక్ లను ప్రదర్శిస్తాయి.

Also Read : Nokia 105 Classic: UPI పేమెంట్ ఫీచర్ తో చవక ధరలో New Phone లాంచ్.!

ఏమిటి ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్?

ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ప్రతి సంవత్సరం కొత్త టెక్నాలజీ ఇన్వెన్స్ లను ప్రదర్శించాడనికి భారత ప్రభుత్వం చేపట్టే ఎగ్జిబిషన్. ఈ టెక్ ఎగ్జిబిషన్ ను డిపార్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (DoT) మరియు సెల్యులార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) నిర్వహిస్తుంది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 ప్రత్యేకత ఏమిటి?

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 ప్రత్యేకత ఏమిటి అని చూస్తే, ఈ సంవత్సరం మరింత విస్తరించనున్న 5G టెక్నాలజీ మరియు నెక్స్ట్ జెనరేషన్ వైర్లెస్ టెక్ అయిన 6G, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ టెక్నాలజీ మరియు మరిన్ని టెక్ సంబంధిత ఇన్నోవేషన్ లను మనము ముందుకు తీసుకు వస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo