iMac 24 Inch ను పవర్ ఫుల్ M4 Chip తో లాంచ్ చేసిన యాపిల్.!

iMac 24 Inch ను పవర్ ఫుల్ M4 Chip తో లాంచ్ చేసిన యాపిల్.!
HIGHLIGHTS

Apple ఈరోజు కొత్త iMac 24 Inch ను పవర్ ఫుల్ M4 Chip తో లాంచ్ చేసింది

ఈ ఐమ్యాక్ ను యాపిల్ ఇంటెలిజెన్స్ తో లాంచ్ చేసింది

ఈ యాపిల్ ప్రోడక్ట్ నవంబర్ 8 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

Apple ఈరోజు కొత్త iMac 24 Inch ను పవర్ ఫుల్ M4 Chip తో లాంచ్ చేసింది. కేవలం ఈ చిప్ సెట్ మాత్రమే కాదు ఈ ఐమ్యాక్ ను యాపిల్ ఇంటెలిజెన్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త సిస్టం ను పూర్తిగా ప్రీమియం ఫీచర్స్ మరియు అఫ్ కోర్స్ ప్రీమియం ధరలో విడుదల చేసింది. ఈరోజే సరికొత్తగా మార్కెట్ లో అడుగుటపెట్టిన ఈ యాపిల్ పవర్ ఫుల్ సిస్టమ్ వివరాలు తెలుసుకుందామా.

iMac 24 Inch : ప్రైస్

ఐమ్యాక్ 24 ఇంచ్ ను ఇండియాలో రూ. 1,34,990 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త 24 ఇంచ్ ఐమ్యాక్ ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ యాపిల్ ప్రోడక్ట్ నవంబర్ 8 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

iMac 24 Inch : ఫీచర్స్

ఈ 24 ఇంచ్ ఐమ్యాక్ పెద్ద 24 ఇంచ్ రెటీనా స్క్రీన్ ను 4.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇది 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ట్రూ టోన్ తో వస్తుంది. ఈ ఐమ్యాక్ 7 కలర్ ఆప్షన్ లో లభిస్తుంది మరియు చాలా స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఐమ్యాక్ యాపిల్ ఇంటెలిజెన్స్ ను కూడా కలిగి వుంది.

iMac 24 Inch

ఈ సిస్టం Apple M4 chip తో పని చేస్తుంది. ఇది 16-core న్యూరల్ ఇంజిన్, 10-core CPU మరియు 10-core GPU తో ఉంటుంది. ఇది 16GB యూనిఫైడ్ మెమొరీ మరియు 256GB SSD తో వస్తుంది. దీన్ని 24GB లేదా 32GB యూనిఫైడ్ మెమొరీ మరియు 512GB, 1TB లేదా 2TB వరకు స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం వుంది.

Also Read: Smart Tv Offer: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 55 ఇంచ్ టీవీ 24 వేలకే అందుకోండి.!

ఈ ఐమ్యాక్ HEVC, H.264, AV1 and ProRes, HDR with Dolby Vision, HDR10+/HDR10 మరియు HLG వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ నుం కలిగి వుంది. ఇందులో 6 హై ఫెడిలిటీ స్పీకర్లు, Spatial Audio మరియు Dolby Atmos సపోర్ట్ లను కలిగి వుంది. ఈ 24 ఇంచ్ ఐమ్యాక్ కంటెంట్ క్రియేటర్స్ మరొఇయి హెవీ గేమర్స్ కి సైతం అనువైన అన్ని వివరాలు కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo