మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని మీకు డౌటా..ఈ లక్షణాలు ఉన్నయోమే చెక్ చేయండి.!

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని మీకు డౌటా..ఈ లక్షణాలు ఉన్నయోమే చెక్ చేయండి.!
HIGHLIGHTS

మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ కు గురైనట్లు అనుమానమా

మీ స్మార్ట్ ఫోన్ లో ఈ లక్షణాలు ఉన్నాయేమో చూడండి

ఈ సింప్టమ్స్ ఉంటే జాగ్రత వహించండి

రోజురోజుకు పెరుగుతన్న టెక్నాలజీ సాయంతో చాలా విషయాలు సులభంగా మారాయి. ముఖ్యంగా, ప్రజలు వారి పనులను వారి మొబైల్ ఫోన్ ద్వారా చాలా సులభంగా ఆన్లైన్లో నిర్వహించడానికి అలవాటు పడిపోయారు. ఇది పసిగట్టిన కొందరు హ్యాకర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసే యాడ్స్ ను అడ్వార్టైజ్ చేయడం లేదా పర్సనల్ డేటాను చేజిక్కించు కోవడం వంటి అనైతిక పనులను చేస్తున్నారు.                     

మీ ఫోన్ లో సాధారంగా కాకుండా ఇక్కడ సూచించిన లక్షణాలను కలిగి ఉన్నట్లయితే, మీరు మీ ఫోన్ గురించి అనుమానం వ్యక్తం చేయవచ్చు. మరి ఆ లక్షణాలు ఏమిటో చూద్దామా.

ముందుగా, మీ హ్యాక్ అయినట్లయితే మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా ఉంటుంది. అంటే, చాలా త్వరగా మీ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. అలాగే, మీరు వాడకుండానే మీ డేటా అయిపోతుంది లేదా మీరు ఉపయోగించే డేటా కంటే అధికంగా డేటా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా, బాగా వేగంగా పనిచేసే మీ ఫోన్ స్పీడ్ సడన్ గా పడిపోతుంది. అంటే, మీ ఫోన్ బాగా స్లో అయిపోతుంది. మీ ఫోన్ లో రన్నింగ్ లో ఉన్న యాప్స్ క్లోజ్ అవ్వడం, ఫోన్ దానంతట అదే Restart అవ్వడం వంటి లక్షణాలు లేదా గుర్తులు మీకు కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు గుర్తించవచ్చు.

అయితే, ఈ లక్షణాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత మొబైల్ లలో చూసే సాధారణ సమస్యగా మీరు గుర్తించవచ్చు. అయితే, కొత్తగా తీసుకున్న లేటెస్ట్ ఫోన్లలో మీరు సమస్యలను గుర్తించినట్లయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు సందేహపడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo