ఇండియాలో నిన్న ఎయిర్టెల్ unlimited కాల్స్ ఆఫర్ రిలీజ్ చేయగా ఈ రోజు ఐడియా సెల్యూలర్ కూడా రెండు ప్రీపెయిడ్ unlimited ఆఫర్స్ ను లాంచ్ చేసింది దేశం అంతటా.
148 రూ కు ఐడియా to ఐడియా unlimited std అండ్ లోకల్ ఫ్రీ కాల్స్ మరియు 300MB 4G ఇంటర్నెట్ డేటా వస్తుంది. validity 28 రోజులు.
348 రూ లకు ఐడియా నుండి ఏ నెట్వర్క్ కు అయినా లోకల్ అండ్ STD unlimited ఫ్రీ కాల్స్ మరియు 1GB 4G ఇంటర్నెట్ వస్తుంది. ఇది కూడా 28 రోజులు validity కలిగి ఉంది.
అయితే నిన్న రిలీజ్ అయిన ఎయిర్టెల్ unlimited మరియు ఐడియా unlimited కాల్స్ అనేవి Jio మాదిరిగా VoLTE తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ పై కాకుండా డైరెక్ట్ వాయిస్ కాల్స్ క్రింద వస్తాయి.
అంటే 4G సిగ్నల్ లేకపోయినా, 2G/3G సిగ్నల్స్ అండ్ ఫోన్స్ లో కూడా unlimited వాయిస్ కాల్స్ పనిచేస్తాయి. ఇక డేటా విషయానికి వస్తే మీ వద్ద 4G ఫోన్ లేనప్పుడు 50MB మాత్రమే వస్తుంది పైన చెప్పిన ఆఫర్స్ తో.
రిలయన్స్ Jio unlimited కాల్స్ అండ్ ఇంటర్నెట్ ను మార్చ్ 31 వరకూ extend చేయటంతో… vodafone డబుల్ డేటా పెంచటం, aircel, ఎయిర్టెల్, ఐడియా unlimited ఆఫర్స్ లాంచ్ చేయటం మొదలుపెట్టాయి.