ఎక్కడ పడితే అక్కడ Phone Charge ఛార్జ్ చేస్తున్నారా.. అయితే, ఈ New Scam గురించి తెలుసుకోండి.!
స్మార్ట్ ఫోన్ నడవాలంటే బ్యాటరీ చాలా అవసరం
ఎక్కడ పడితే అక్కడ Phone Charge ఛార్జ్ చేస్తే మీ డేటా చోరీ అవుతుంది
దేశంలో సాగుతున్న ఈ New Scam చెమటలు పట్టిస్తోంది
స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపొతే పొద్దుపోనీ లోకం లోకి మనం మారిపోయాము. అయితే, స్మార్ట్ ఫోన్ నడవాలంటే బ్యాటరీ చాలా అవసరం. అందుకే, ఛార్జర్ ను వెంటే పెట్టుకుని మరీ తిరుగుతుంటారు. ఛార్జ్ అయిపోతే వెంటనే దొరికిన దగ్గర ఫోన్ ను ఛార్జ్ చేస్తుంటారు. అయితే, ఎక్కడ పడితే అక్కడ Phone Charge ఛార్జ్ చేస్తే, మీ డేటాని ఇంకొకరి చేతుల్లో పెట్టినట్లే అవుతుంది. దేశంలో సాగుతున్న ఈ New Scam గురించి తెలుసుకోండి.
Phone Charge Scam
చాటింగ్, షూటింగ్, డేటింగ్, గేమింగ్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత అవుతుంది ఈ లిస్ట్. ఇవన్ని కూడా జెస్ట్ అరచేతిలో ఇమిడేలా చేసిన ఘనత స్మార్ట్ ఫోనుకే దక్కుతుంది. ఇదంతా కూడా టెక్నాలజీ తీసుకు వచ్చిన వెసులుబాటు అయితే, ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని స్కామ్ చేయడం పరిపాటి అవుతోంది.
ఇప్పుడు దేశంలో కొత్తగా నడుస్తున్న కొత్త స్కామ్ ఇందుకు ఉదాహరణ అవుతుంది. ఇప్పుడు స్కామర్లు ఛార్జ్ పాయింట్స్ ద్వారా యూజర్ల డేటాని తస్కరిస్తునట్లు లేదా కలెక్ట్ చేస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి మోసాల భారినపడ్డ బాధితులు దీని గురించి హెచ్చరిస్తున్నారు.
ఎలా చేస్తారు ఈ New Scam?
ప్రస్తుతం అనేక ఆన్లైన్ స్కామ్స్ దేశంలో వెలుగులో ఉంటే, USB Charge Scam కొత్తగా ఈ లిస్ట్ లో వచ్చి చేరింది. దీని గురించి ప్రభుత్వ హెచ్చరిక విభాగం, ‘Indian Computer Emergency Response Team’ (ICERT) హెచ్చరికలు జారీ చేసింది. ICERT అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ కొత్త స్కామ్ గురించి నోట్ పాయింట్స్ ను విడుదల చేసింది.
దీని ప్రకారం, స్కామర్లు బస్టాండ్, ఎయిర్ పోర్ట్, Cafes వంటి చాలా బహిరంగ ప్రదేశాల్లో అమర్చిన USB Charge Points ద్వారా ఈ స్కామ్ చేస్తున్నట్లు తెలిపింది. ఎవరైనా ఈ పబ్లిక్ ఛార్జ్ పాయింట్స్ ను డి వారి ఫోన్ లను ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తే, వారి ఫోన్ లు Juice-Jacking Cyber Attack కి గురవవుతాయని తెలిపింది.
Also Read: AI Image కోసం WhatsApp లో కొత్త ఫీచర్ .. ఇక ఫోటోలు మాములుగా ఉండవు.!
ఈ సైబర్ ఎటాక్ కి గురైన ఫోన్ లలో మాల్వేర్ యాప్ లను డౌన్ లోడ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ నుండి స్కామర్లు డేటాని కలెక్ట్ చేయడానికి కూడా సహకరిస్తుంది. అంటే, ఫోన్ మరియు డేటా పూర్తిగా రిస్క్ లో పడుతుంది.
మరి ఏమి చెయ్యాలి?
మీ ఫోన్ లను పబ్లిక్ ప్లేస్ లో ఛార్జ్ చేసే ముందుగా 10 సార్లు ఆలోచించడం మంచిది. నిజానికి, ఛార్జ్ చేయకపోవడమే మంచిది. అత్యవసర సమయాల్లో మీ ఫోన్ ఛార్జ్ కోసం మీ పర్సనల్ పవర్ బ్యాంక్ ని మాత్రమే వినియోగించండి. తప్పని పరిస్థులు ఉంటే USB పిన్ ద్వారా కాకుండా పవర్ పాయింట్ (ఎలక్ట్రిక్ ప్లగ్) ద్వారా మాత్రమే ఛార్జ్ చేయడానికి ప్రయత్నించడం మంచిది.
స్కామర్లు ఎప్పటి కప్పుడు కొత్త స్కామ్ లతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే, యాగిన్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సురక్షతంగా ఉండవచ్చు.