హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..Whatsapp సర్వీస్ వచ్చేసింది.!

హైదరాబాద్  మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..Whatsapp సర్వీస్ వచ్చేసింది.!
HIGHLIGHTS

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది

కొత్త సేవలను హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్ ప్రారంభించింది

హైదరాబాద్ మెట్రో రైల్ కోసం చాట్ బాట్ అందుబాటులోకి వచ్చింది

హైదరాబాద్  మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉరుకులు పరుగుల నగర జీతానికి సులభమైన మార్గంగా మెట్రో సులభమైన మార్గంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ మెట్రో సర్వీస్ ను మరింత సులభం మరియు పారదర్శకంగా అందరికి అందించే దిశగా కొత్త సేవలను హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్ ప్రారంభించింది. అదేమిటంటే, జనరంజక మెసేజింగ్ యాప్ వాట్సాప్ తో హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త సర్వీస్ ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా Whatsapp లో హైదరాబాద్ మెట్రో రైల్ కోసం చాట్ బాట్ అందుబాటులోకి వచ్చింది. 

దీని ద్వారా, చాలా ఈజీగా టికెట్ బుకింగ్, మెట్రో ట్రైన్ టైమింగ్ మరియు షెడ్యూల్స్ తో పాటుగా మరిన్ని వివరాలను మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ లోనే పొందవచ్చు. అంతేకాదు, టికెట్ రేట్స్, టాప్ అప్ మరియు టికెట్ కొనుగోళ్లు కూడా ఈ వాట్సాప్ చాట్ బాట్ తో చేసుకోవచ్చు. మెట్రో సర్వీస్ ల కోసం ఈ వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు బెంగుళూరు, పూణే మరియు ముంబై నగరాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. 

మెట్రో Whatsapp చాట్ బాట్ 

మెట్రో Whatsapp చాట్ బాట్ సర్వీస్ లను ఉపయోగించడానికి +918105556677 నంబర్ ను ముందుగా మీ ఫోన్ లో సేవ్ చేసుకొని చాటింగ్ కొనసాగించవచ్చు. ఈ చాట్ బాట్ సర్వీస్ నుండి చాలా ఈజీగా టికెట్ బుకింగ్, మెట్రో ట్రైన్ టైమింగ్ మరియు షెడ్యూల్స్, టికెట్ రేట్స్, టాప్ అప్ మరియు టికెట్ కొనుగోళ్లను కూడా చేయవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ కొత్త వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ లను తీసుకువచ్చినట్లు తెలిపారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo