భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు. ఏ ఫోన్లు అంటే.!

Updated on 12-Sep-2022
HIGHLIGHTS

Apple కొన్ని పాత ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది

యాపిల్ భారీగా ధర తగ్గించిన మోడళ్లలో 13 సిరీస్ ఫోన్లు కూడా వున్నాయి

మరి కొన్ని ఫోన్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది

ఈ కొత్త ఐఫోన్ 14 లైనప్‌ను ప్రారంభించిన తర్వాత, కొన్ని పాత ఫోన్ల ధరలను యాపిల్ భారీగా తగ్గించింది. అంతేకాదు, మరి కొన్ని ఫోన్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. యాపిల్ భారీగా ధర తగ్గించిన మోడళ్లలో గత సంవత్సరం తీసుకువచ్చిన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు కూడా వున్నాయి. కాబట్టి, ఈరోజు మనం యాపిల్ పూర్తిగా నిలిపేసిన మరియు ధర తగ్గించిన ఐఫోన్ల గురించి తెలుసుకోనున్నాము.

ముందుగా, ఐఫోన్ 14 లైనప్‌ రాకతో ఆగిపోనున్న ఐఫోన్ల గురించి ముందుగా తెలుసుకుందాం. 14 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 14 ప్రో కొత్త ప్రో సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన తరువాత గత సంవత్సరం తీసుకొచ్చిన ప్రో ఫోన్లయిన iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max లను తొలగించింది. అంటే, ఈ రెండు ఫోన్లు కూడా ఇకపై యాపిల్ స్టోర్ నుండి అందుబాటులో ఉండవు. అంతేకాదు, 13 Pro ఫోన్లతో పాటు, Apple లైనప్ నుండి iPhone 11 మరియు iPhone 12 mini లను కూడా తీసివేసింది.

ఇక Apple iPhone 14 ఫోన్ల లాంచ్ తరువాత ధర తగ్గినా ఫోన్ల విషయానికి వస్తే, iPhone 13 ఇప్పుడు 69,900 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 13 మినీ ధర రూ.64,900 నుండి, iPhone SE (2022) ధర రూ.49,900 నుండి మరియు iPhone 12 యొక్క ధర రూ.59,900 నుండి ప్రారంభమవుతుంది. అంటే, లాంచ్ సమయంలో వచ్చిన ధరలతో పోలిస్తే ఐఫోన్ 13 పైన 10,000 వేల రూపాయలు మరియు 12 పైన 20 వేల రూపాయల వరకూ తగ్గింపును చూడవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :