ఆకాశానంటిన బంగారం ధర..ఈరోజు ఎంత పెరిగిందంటే.!

Updated on 05-Apr-2023
HIGHLIGHTS

ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర దూసుకుపోయింది

ఒక్కరోజే తులానికి రూ.1,000 రూపాయలకు పైగా పెరిగిన బంగారం ధర

గోల్డ్ మార్కెట్ సూచీలు ఈ వారం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి

ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర దూసుకుపోయింది. కేవలం ఈ ఒక్కరోజే తులానికి రూ.1,000 రూపాయలకు పైగా బంగారం ధర పెరిగిందంటే బంగారం ధర ఎంత స్పీడ్ గా పెరుగుతుందో మీరే అంచనా వేయవచ్చు. గత వారం చివరిలో కూడా కొంత నెమ్మదించిన గోల్డ్ మార్కెట్ సూచీలు ఈ వారం మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దామా.

Gold Rate Update:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.55,300 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.950 రూపాయలు పెరిగి రూ.56,250 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,330 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.61,360 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు బంగారం ధర రూ.1,030 రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేసింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,360 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,360 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,510 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,070 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :