Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర..బిగ్ అప్డేట్ తెలుసుకోండి.!

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర..బిగ్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

బంగారం కొనాలని చూస్తున్న వారికి పెద్ద షాక్

బంగారం ధర ఈ రెండు రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసింది

గోల్డ్ మార్కెట్ రూ.1,300 రూపాయలకు పైగా పెరుగుదలను చూసింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ బంగారం కొనాలని చూస్తున్న వారికి పెద్ద షాక్ ఇచ్చింది. గత వారం మొత్తం మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రెండు రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసింది. కేవలం ఈ ఒక్కరోజే తులానికి 820 రూపాయలు బంగారం ధర పెరిగినదంటే, మీరు అర్ధం చేసుకోవచ్చు. నిన్న కూడా బంగారం ధర తులానికి 540 రూపాయలు పెరిగింది. అంటే, మొత్తంగా ఈరెండు రోజుల్లో గోల్డ్ మార్కెట్ రూ.1,300 రూపాయలకు పైగా పెరుగుదలను చూసింది. మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా. 

Gold Rate:

ఈరోజు ఉదయం రూ.51,400 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఈరోజు 750 రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.52,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.56,070 రూపాయల నుండి రూ.820 రూపాయలు పెరిగి రూ.56,890 వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,890 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,890 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,040 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo