రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర..ఈరోజు ఎంత తగ్గిందంటే.!

Updated on 23-Jun-2023
HIGHLIGHTS

మార్కెట్ లో రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర

బంగారం ధర ఈరోజు కూడా భారీగానే తగ్గింది

వారం మొత్తం మీద గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 1,100 రూపాయల వరకూ తగ్గింది

మార్కెట్ లో రోజు రోజుకి పడిపోతున్న బంగారం ధర ఈరోజు కూడా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యింది. బంగారం ధర ఈరోజు (జూన్ 23) కూడా భారీగానే తగ్గింది. ఈ వారం మొత్తం మీద గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 1,100 రూపాయల వరకూ తగ్గింది. నిన్న మొన్నటి వరకూ 62 వేల రూపాయల వద్ద కొనసాగిన బంగారం ధర ప్రస్తుతం 60 వేల రూపాయల మార్క్ దిగువున సాగుతోంది. మరి ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎంత తగ్గిందో తెలుసుకుందామా. 

ఈరోజు బంగారం ధర

ఈరోజు (జూన్ 23) బంగారం ధర (10 గ్రాముల 24K) రూ. 59,450 రూపాయల వద్ద మొదలై రూ. 430 రూపాయలు క్రిందకు దిగి రూ. 59,020 వద్ద ముగిసింది. అలాగే, రూ. 54,500 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 400 రూపాయలు క్రిందకు దిగి రూ. 54,100 వద్ద ముగిసింది. గత మూడు నెలల కనిష్ఠాన్ని ఈరోజు గోల్డ్ మార్కెట్ చూసింది. 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గోల్డ్ రేట్ వివరాలను పరిశీలిస్తే, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 59,450 రూపాయలుగా ఉంది మరియు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 54,100 రూపాయలుగా ఉంది. 

గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు సంభవిస్తాయని గమనించాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :