Gold Price Drop: భారీగా తగ్గిన బంగారం ధర..!!

Updated on 01-Nov-2022
HIGHLIGHTS

బంగారం కొనాలని చూస్తున్న వారికి ఈరోజు నిజంగా శుభ సమయం

ఈరోజు గోల్డ్ మార్కెట్ 12 నెలల కనిష్ఠాన్ని నమోదు చేసింది

గోల్డ్ రేట్ ఈరోజు భారీ తరుగుదలను నమోదు చేసింది

బంగారం కొనాలని చూస్తున్న వారికి ఈరోజు నిజంగా శుభ సమయం. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర తులానికి ఏకంగా 660 రూపాయలు క్రిందకు పడిపోయింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ 12 నెలల కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఈరోజు భారీ తరుగుదలను నమోదు చేసింది. ఇక నాలుగు రోజుల మార్కెట్ ని పరిశీలిస్తే మొత్తంగా తులానికి 1,000 రూపాయలకు పైగా బంగారం ధర పడిపొయింది. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోంది మరియు కొత్త అప్డేట్స్ ఏమిటో తెలుసుకోండి.

Gold Price Drop:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు 6000 రూపాయల భారీ తరుగుదలను నమోదు చేసి, గోల్డ్ ధర 46,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,180 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,350 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330 గా ఉంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :